శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Mar 09, 2020 , 00:24:59

గాలివాన..

గాలివాన..

చింతలమానేపల్లి/ కౌటాల/ సిర్పూర్‌(టి)/ బెజ్జూర్‌: జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆదివారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌ మండలంలో తేలిక పాటి వర్షాలు కురవగా సిర్పూర్‌-టి బెజ్జూర్‌, కౌటాల, చిం తలమానెపల్లి, బెజ్జూర్‌లో బలమైన గాలులతో వర్షం కురిసింది. కౌటాలలో ముత్యంపేట్‌, విజయనగర్‌ వెళ్లే రోడ్లుపై చెట్టు విరిగిపడింది. చింతలమానెపల్లి మండలంలోని కేతి ని, రవీంద్రనగర్‌లో పెద్దపెద్ద చెట్లు విరిగి పడ్డాయి. ఆసిఫాబాద్‌లో 2.1, కాగజ్‌నగర్‌లో 4.3, సిర్పూర్‌-టిలో 1.3, కౌటాలలో 13.1, చింతలమానెపల్లిలో 20.0, బెజ్జూర్‌లో 18.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  చింతలమానెపల్లి మండల కేంద్రంలో మూడు గంటల పాటు ఏకదాటిగా కు రిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రవీంద్రనగ ర్‌-2, కేతిని ప్రధాన ర హదారులపై చెట్లు విరిగిపడగా గంగాపూర్‌లో కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఇంటిపైకప్పులు లేచి పోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతుల పెసరు, శనగ అకాల వర్షం కారణంగా నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం ప్రజలకు, రై తులకు నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూర్‌, కుకుడ, కాటెప ల్లి, ముంజంపల్లి, బారెగు గ్రామాల్లో గాలితో కూడి న వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బెజ్జూర్‌లోని వారసంతలో చిరువ్యాపారులు, సంతకు వచ్చిన వారు వర్షానికి వస్తలు పడ్డారు. వర్షంతో తాము సాగుచేసి శనగ పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆం దోళన వ్యక్తం చేశారు. సిర్పూర్‌(టి) మండలంలో ని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండలకేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలోని ఇండ్లల్లోకి వర్షం నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


logo