శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Komarambheem - Mar 09, 2020 , 00:22:42

అతివల ఆనందం

అతివల ఆనందం

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ సంబురాల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. గురుకులాలు, కార్యాలయాల ఆవరణలో విద్యార్థినులకు మహిళలు సాధించిన గొప్ప గొప్ప విజయాల గురించి వివరించారు. వారిని స్ఫూర్తిగా తీ సుకోవాలని సూచించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఏఎస్పీ సుధీంద్ర 2కే రన్‌ను ప్రారం భించారు. జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి  జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ సోయం బాపూరావు జైనూర్‌లో నిర్వహించిన రాణి దుర్గావతి విగ్రహాన్ని ఆవిష్కరించి మగువ గొప్పతనాన్ని వివరించారు.

అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రా ణించాలని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి పి లుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా కేంద్రంలోని గిరిజన మ హిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా మూడో ఆదనపు న్యాయమూర్తి నారాయణ బాబుతో కలసి పాల్గొన్నారు. విద్యార్థినులతో కలసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆడ పిల్ల పుట్టుక భారం కాదనీ, వరమన్నారు. మహిళలపై చూపుతున్న వివక్షను పారద్రోలాలనీ, అందుకు రాజకీయ, విద్య, పారిశ్రమిక రంగాల్లో రాణించాలన్నారు. తన రాజకీయ ప్రస్థానం ఎంపీటీసీ నుంచి మొదలై ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు వరకు కొనసాగిందన్నా రు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకోని పట్టుదలతో చదవాలని సూచించారు. మన జిల్లా లో వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో అమ్మాయిలు ఇప్పటికీ విద్యకు దూరంగా ఉంటున్నారని అవేధన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి  నారాయణ బాబు మాట్లాడుతూ మహిళలపై వివక్ష ఇంటి నుంచే ప్రారంభం అవుతుందన్నారు. పురుషులకు అన్ని విషయాల్లో, ప్రా ధాన్యత ఇచ్చి మహిళలకు ఇవ్వ డం లేదన్నా రు. నేటి సమాజంలో మహిళలు పురుషులకు ధీటుగా సైనిక, నేవీ, పారిశ్రమిక రంగాల్లో రా ణిస్తున్నారన్నారు. ప్రిన్సిపాల్‌ సంపత్‌, న్యా యవాదులు జీవీఎస్‌ ప్రసాద్‌, రాజీవ్‌రెడ్డి, సతీశ్‌ బాబు, సఖీ కేంద్రం సభ్యులు నరేంద ర్‌, సౌజన్య, జీసీడీవో శకుంతల, ఆధ్యాపకు లు పాల్గొన్నారు.


logo