శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Komarambheem - Mar 09, 2020 , 00:21:50

సమాజంలో మహిళల పాత్ర కీలకం

సమాజంలో మహిళల పాత్ర కీలకం

కాగజ్‌నగర్‌ టౌన్‌: సమాజంలో మహిళల పాత్ర కీలకమని ఏఎస్పీ వైవీఎస్‌ సుధీం ద్ర అన్నారు. ప్రపంచ మహిళ దినోత్సవాన్ని వివిధ సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించా రు. ఏఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర ఆధ్వర్యంలో 2కే రన్‌ చేపట్టారు. పట్టణంలో ని రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి చౌర స్తా వరకు యువతీ, యువకులు  ర్యాలీలో పాల్గొన్నారు. త్రిశూల్‌ పహాడ్‌పై మెప్మా ఆధ్వర్యంలో కమిషనర్‌ తిరుపతి కేక్‌ కట్‌ చే సి సంబురాలు చేసుకున్నారు. డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అనిత ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగా ణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగి డిప్యూటీ ఎప్‌ఆర్వో రమాదేవిని శాలువాతో సన్మానించారు. డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి, ఎస్‌హెచ్‌వో మోహన్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.  

చింతలమానేపల్లి: బాలాజీఅన్‌కోడతో పాటు పలు గ్రామాల్లో మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్‌కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. వేడుకల్లో జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి పాల్గొని మాట్లాడారు.  మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. సర్పంచ్‌ రౌతు సుజాత, కార్యదర్శి సుజాత, ఉప సర్పంచ్‌ నందు, మాజీ ఎం పీపీ డుబ్బుల వెంకయ్య, అంగన్‌వాడీ టీచర్‌లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఉన్నారు. 

దహెగాం: వివిధ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. దహెగాం, మత్తిని, కల్వాడ, కొంచవెల్లి, తదితర గ్రామాల్లో మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీవో రాజ్వేర్‌గౌడ్‌ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర, ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి చే స్తున్న చట్టాలను వివరించారు. దేశం కోసం త్యాగాలు చేసిన పలువురు మహిళల గురిం చి వివరించారు. సర్పంచులు కిన్నర్ల సుజా త, మట్కరి గోపీ బాయి, రౌతు భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ బండి రాజేశ్వరి ఉన్నారు. 

బెజ్జూర్‌: ప్రభుత్వ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో కొలాం వార్‌ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించా రు. ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానా మాట్లాడు తూ మహిళల హక్కులు, రిజర్వేషన్లపై వివరించారు. మహిళలు కూడా పరుషులతో సామానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారనీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్‌ 50 శాతం రిజర్వేషన్‌ మహిళలకే కేటాయించడంతోనే రాజకీయంగా రాణిస్తున్నారన్నారు. ఆశ్రమ విద్యార్థినులు గొప్పగా చదివి ఉన్నత ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండలా ధ్యక్షుడు సిడం సకారాం, హెచ్‌ఎం పార్థి రాం, కార్యదర్శి రవికుమార్‌, మహిళా కానిస్టేబుల్‌ సుచరిత, కొలాంవార్‌ మండలాధ్యక్షుడు పెద్దల శంకర్‌, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి): వెంపల్లి, పారిగాం, సిర్పూర్‌(టి) గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. స ర్పంచులు కేక్‌ కట్‌ చేసి వేడుకలను చేశారు. గ్రామాల సర్పంచులు తఫిమా పర్వీన్‌, డొల్లె లక్ష్మి, డుర్కె లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు దేవిక, సంతోష్‌, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. 


logo