మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Mar 09, 2020 , 00:21:50

మహిళల సంక్షేమానికి సింగరేణి కృషి

మహిళల సంక్షేమానికి సింగరేణి కృషి

మందమర్రి రూరల్‌ : మహిళల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తున్నదని మందమర్రి ఏరియా జీఎం రమేశ్‌రావు, ఆయన సతీమణి, ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఇల్లాందు క్లబ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారు పాల్గొని మాట్లాడారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయ, ఉద్యోగ, విద్య రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. సింగరేణిలోనూ కింది స్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి అధికారి వరకు మహిళలు ఉద్యో గ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సు మారు 15 వేల మందికి  సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పలు వృత్తి, ఉపాధి శిక్షణ కోర్సులో శిక్షణ  ఇస్తున్నారని తెలిపారు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఉత్తమ మహిళలను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, తాసిల్దార్‌ కవిత, సురేఖ, పీఎం మురళీధర్‌రావు, మాధవి శ్రీనివాస్‌రావు, డీవై ఎంపీ శ్యామ్‌ సుందర్‌, రెడ్డి మల్ల తిరుపతి పాల్గొన్నారు. 

రెబ్బెన : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య  సేవా సమితి సభ్యురాలు లక్ష్మీకుమారి పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియా లోని గోలేటిటౌన్‌షిప్‌లో గల సింగరేణి ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందించారు.  బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి విద్య కోర్సులను నేర్చుకొని,  స్వయం ఉపాధి దిశగా సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య, ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఐ.లక్ష్మణ్‌రావు, డీవైపీఎం లోల్ల రామాశాస్త్రి, సీనియర్‌ పీఓ విశ్రాంత్‌కుమార్‌, గోలేటి సర్పంచ్‌ పొటు సుమలత, లేడిస్‌ క్లబ్‌ సెక్రటరీ లీలాకుమారి, సీనియర్‌ సేవా సమితి సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, ఫ్యాకల్టీ మెంబర్స్‌ రూప, తిరుమల, సౌజన్య, స్రవంతి, జాన్సీరాణి, శారద, మహిళలున్నారు.

శ్రీరాంపూర్‌ : మహిళలు అన్ని రంగాల్లో పోటీపడాలని, సింగరేణీ మహిళా పరోక్ష కృషితోనే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీరాంపూర్‌ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సింగరేణి ఆద్వర్యంలో అదివారం రాత్రి శ్రీరాంపూర్‌ కాలనీ ప్రగతీ స్టేడియం సీఈఆర్‌ క్లబ్‌ వద్ద మహిళా దినోత్సవాన్ని ఘనంగా  నిర్వహించారు. ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు సరళాదేవి, సేవా కార్యదర్శి కొట్టె జ్యోతి, సహాయ కార్యదర్శి రత్నకల, డాకార్‌ విజయలక్షి,  టీబీజీకేఎస్‌ నాయకులు, సింగరేణి ఏరియా అధికారులు, కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు. 


logo
>>>>>>