శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Mar 07, 2020 , 23:38:03

ప్రగతి కాంతులు

ప్రగతి కాంతులు

కాగజ్‌నగర్‌ టౌన్‌: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. పది రోజు ల పాటు 30 వార్డుల్లో కలియదిరిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానికులతో మాట్లాడి పట్టణ ప్రణాళికలను సిద్ధం చేశారు. డివిజన్లు, వార్డుల వారీగా మౌ లిక సదుపాయాల కల్పన, వివిధ సమస్యల పరిష్కరానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. ముఖ్యంగా ఏళ్లుగా నిర్లక్ష్యంగా వదిలేసిన విద్యుత్‌ ఇబ్బందులు తొలగిపోతున్నాయి. చెత్తా చెదారంతో నిండిన ఖాళీ స్థలాలన్ని శుభ్రం చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లే అవుట్లు, నిరక్షరాస్యుల లెక్కలు కూడా తేలాయి. కాగా ఈ పది రోజుల కార్యక్రమంలో మున్సిపాలిటీలో ఆయా వార్డులకు చెందిన ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


విద్యుత్‌, పారిశుధ్య సమస్యలు

మున్సిపాలిటీలో విద్యుత్‌ శాఖకు చెందిన శిథిలావస్థకు చేరిన, రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లూజ్‌ వైర్ల తొలగింపు పనులు నిర్వహించా రు. ప్రతి వీధిలో మురుగు కాలువలను శుభ్రం చే యించారు. ప్రజలకూ పరిశుభ్రతపై అవగహన కల్పించారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని నిర్ణయించారు. పలు వీధుల్లో స్తంభాలకు వి ద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. చెత్త బుట్టలు పం పిణీ చేశారు. ఆయా కాలనీల్లో రోడ్డుకు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్‌ తీగలను తొలగించారు. పది రోజుల్లో చేపట్టిన పనులతో పలు వార్డులు కళకళలాడుతున్నాయి.


పదిరోజుల్లో సంతృప్తికర ప్రగతి 

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో పది రోజుల పాటు కొనసాగిన పట్టణ ప్రగతిలో అన్ని వార్డుల్లో సంతృప్తికర రీతిలో పనులు కొనసాగాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పట్టణంలోని సర్ధార్‌బస్తీ, వార్డు నం 5, న్యూ కాలనీల్లో రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలను తొలగించారు. వార్డు నెం 28లోని గణేశ్‌ మందిర్‌లైన్‌, న్యూకాలనీ, నౌగాం బస్తీలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు కాలువల్లో పేరుకపోయిన పూ డికతీత పనులు చేశారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ రాంబాబు పనులను ప్రత్యక్షం గా పరిశీలించి పురోగతిపై సమీక్షించారు. పలు వార్డు ల్లో చేపట్టాల్సిన పనులపై నివేదికను సిద్ధం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ వైస్‌ చైర్మన్‌ గిరీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. 


logo