గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 07, 2020 , 23:35:02

సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర

సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె నిద్ర నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో దాసరి వేణు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని చిర్రకంట గ్రామంలో పల్లెనిద్ర చేశారు. శనివారం గ్రామ పంచాయతీ పరిధిలోని రింగాన్‌గూడ, ఎర్రగుట్ట, డొంగురుగూడలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో బసచేస్తే ప్రజలకు పాలనపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. దీంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలు క్షేత్ర స్థాయిలో చూడడం జరుగుతుందన్నారు. వాటి పరిష్కరం త్వరగా అవుతాయిని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ అలీబీన్‌ హైమద్‌, తాసిల్దార్‌ ఇజాజ్‌ హైమద్‌ఖాన్‌, ఎంపీడీవో రమేశ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంధం శ్రీనివాస్‌, సర్పంచులు, వార్డు సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo