ఆదివారం 25 అక్టోబర్ 2020
Komarambheem - Mar 06, 2020 , 23:43:05

జనగణన పకడ్బందీగా ఉండాలి

జనగణన పకడ్బందీగా ఉండాలి

సీసీసీ నస్పూర్‌: జనాభా గణన-2021 సంబంధిం చి జిల్లాలో అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలని  కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశించారు. సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మం దిరంలో గణన అధికారులతో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని పలు సూచనలు చేశారు. జనాభాలో దేశం ప్రపంచంలో రెం డో స్థానంలో ఉందన్నారు. ప్రతి పదేండ్లకోసారి జాతీ య అర్థిక గణన చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి సారిగా జన గణన జరుగుతుం ది కాబట్టి పకడ్బందీగా ఉండేలా అధికారులు దృష్టి సా రించాలన్నారు. జనాభా ప్రాతిపదికన ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుందనీ, అధికారులు ఏకాగ్రత, చిత్తశుద్ధితో తప్పులు లేకుండా గణన చేపట్టాలన్నారు. జిల్లాలోని ఇళ్లు, ఇంట్లోని వ్యక్తుల వివరాలు పూర్తి స్థా యిలో సేకరించి నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేడయం తో పాటు లెక్కింపు సిబ్బంది వారి మొబైల్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సాకుగా చూ పుతూ జనాభా గణన కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. మొదటి రోజు డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్బరాజుతో పాటు మరో ఇద్దరు మాస్టర్‌ ట్రైనీలతో శిక్షణ ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్‌ సురేందర్‌రావు, ట్రైనీ కలెక్టర్‌ కు మార్‌ దీపక్‌, ఆర్డీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో నరేందర్‌, ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. 


logo