మంగళవారం 27 అక్టోబర్ 2020
Komarambheem - Mar 06, 2020 , 23:43:29

పోలీసులు బాధ్యతతో మెలగాలి

పోలీసులు బాధ్యతతో మెలగాలి

సీసీసీ నస్పూర్‌: ప్రతి పోలీస్‌ బాధ్యతాయుతంగా మెలగాలని రామగుండం కమిషనరేట్‌ బ్లూకోర్ట్‌ ఇన్‌చార్జి, రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ‘బ్రెయిన్‌ స్టార్మింగ్‌' నిర్వహించారు. జిల్లాలోని బ్లూ కోర్ట్‌ సిబ్బంది పాల్గొనగా, బ్లూకోర్టు ఇన్‌చార్జి కృష్ణకుమార్‌, మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణ వారికి సలహాలు, సూచనలు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు. ప్రతి పని బాధ్యతగా తీసుకొని విధులు నిర్వర్తించాలన్నారు. సమస్య తీర్చాలని ప్రజల నుంచి ఫోన్‌ వచ్చిన వెంటనే వారి వద్దకు చేరుకోవాలన్నా రు. రోడ్డు భద్రత, మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నా రు. బ్లూకోర్ట్‌ సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహించకుం డా నిరంతరం కాలనీల్లో తిరగాలన్నారు. బైక్‌ నడిపేవారు హెల్మెట్‌ వాడాలని కృష్ణకుమార్‌ కోరా రు. చోరీలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామనీ, గ్రామాలకు వెళ్లేప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దనీ, తమకు సమాచారం ఇస్తే నిరంతరం గస్తీ కాస్తామని చెప్పారు. జిల్లాలోని బ్లూకోర్డు సిబ్బంది పాల్గొన్నారు. 


logo