బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 06, 2020 , 23:28:47

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: ప్రజా ఫిర్యాదులపై తాసిల్దార్లు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆయా మండలాల తాసిల్దార్ల పని తీరుపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాసిల్దార్లకు వచ్చిన అర్జీల్లో ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివిధ రకాల పనులు, సర్టిఫికెట్ల కొరకు తాసిల్దార్‌ కార్యాలయానికి వస్తుంటారని వారి వెనక్కి పంపించకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెబ్బెన మండలంలో 260కి 179 పెండింగ్‌, కాగజ్‌నగర్‌లో 168కి 129 పెండింగ్‌, సిర్పూర్‌(టి)లో 132కి 93 పెండింగ్‌, పెంచికల్‌పేటలో 146కు 80 పెండింగ్‌, దహేగాంలో 154కు 71 పెండింగ్‌, చింతలమానేపల్లిలో 113కి74 పెండింగ్‌, కౌటాలలో 133కి 74 పెండింగ్‌, వాంకిడిలో 149 కి 52 పెండింగ్‌, ఆసిఫాబాద్‌లో 271కి 34 పెండింగ్‌, కెరమెరిలో 59 కి 48 పెండింగ్‌, జైనూర్‌లో 34 కి 10 పెండింగ్‌, బెజ్జూర్‌లో 88 కి 20 పెండింగ్‌, తిర్యాణిలో 33 కి4 పెండింగ్‌, సిర్పూర్‌(యు)లో 15 కు 5 పెండింగ్‌, లింగాపూర్‌లో 14 అర్జీలకు 14 పరిష్కరించడం జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు వారంలోగా పూర్తిగా పరిష్కరించాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లో వచ్చిన మొత్తం దరఖాస్తులు 5128కి 2722 పూర్తి చేయడం జరిగిందన్నారు. నల్లా కనెక్షన్‌, మీసేవ డిస్పోసల్‌, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఎఫ్‌- లైన్‌ పిటిషన్స్‌, ఇంకామ్‌ సర్టిఫికెట్స్‌, సీఎం నుంచి వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. వారంలోగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ట్రైనికలెక్టర్‌ హేమంత్‌, డీఆర్‌వో ప్రభాకర్‌, ఆర్డీవో సిడాం దత్తు, తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>