బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 06, 2020 , 23:27:58

సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర

సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర

బెజ్జూర్‌: గ్రామాల్లోని  సమస్యలను పరిష్కరించేందుకే పల్లె నిద్ర నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజేందర్‌ అన్నారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు వారానికి ఒక గ్రామ పంచాయతీని సం దర్శించి, గ్రామంలో పర్యటిస్తామన్నారు. గురువారం సా యంత్రం ఎంపీడీవో రాజేందర్‌, ఈజీఎస్‌ ఈసీ రజినీకాం త్‌, ఇతర సిబ్బందితో కలిసి మండలంలోని తలాయి జీపీకి చేరుకున్నారు. ముందుగా గ్రామస్తులతో కలిసి వాడవాడ నా పర్యటించి సమస్యలను గుర్తించారు. అనంతరం స్థానిక సర్పంచ్‌ లంగారి చంద్రకళ అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. వీధి దీపాలను సక్రమంగా ఏర్పాటు చేసేందుకు సం బంధింత అధికారులతో మాట్లాడారు. రాత్రి బస అనంత రం శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే గ్రామంలో కలి యదిరిగారు. గ్రామంలో రోడ్డు పక్కన కంచెలతో ఇబ్బందు లు ఎదురవుతున్నాయని పలువురు ఆయన దృష్టికి తెచ్చా రు. దీంతో సమస్యాత్మకంగా కంచెలు వేసిన వారికి నోటీసు లు జారీ చేయాలనీ, అవసరమైతే  వినిపించుకోని వారికి జ రిమానా విధించాలని కార్యదర్శి తుకారాంను ఆదేశించారు. ఉపాధిహామీ పనులపై కూలీలకు అవగాహన కల్పించారు. జాబ్‌ కార్డులు లేని వారికి కార్డులు ఇవ్వాలనీ, స్థానికంగా ఉపాధి హామీలో పనులు కల్పించాలని ఈసీ రజినీ కాంత్‌ ను ఆదేశించారు. అదే విధంగా ఇంటింటికీ ఇంకుడు గుంత లు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికను పరిశీలించి కొనసాగుతున్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. డ్రాపౌట్లు ఉండకుండా చూడాలని హెచ్‌ఎం వినోద్‌కు సూచించారు. మ ధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలనీ, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి కాపాడాలని సూచించారు. పలు స మస్యలపై ఎంపీడీవోకు గ్రామస్తులు విన్నవించారు. ఎం పీటీసీ లంగారి శ్రీనివాస్‌, టీఏ రమేశ్‌, మాజీ సర్పంచ్‌ నీల య్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo