గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 06, 2020 , 23:27:58

మహిళలకు ఆటల పోటీలు

మహిళలకు ఆటల పోటీలు

సీసీసీ నస్పూర్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నస్పూర్‌కాలనీ మనోరంజన్‌ సముదాయ్‌లో మహిళలకు ఆట పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్‌, బాంబ్‌బ్లాస్ట్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, షాట్‌ఫుట్‌, చిన్న పిల్లలకు రన్నింగ్‌ పోటీలు నిర్వహించారు. మహిళలు, పిల్లలంతా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలను శ్రీరాంపూర్‌ ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ అజ్మీరా తుకారాం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు 8వ తేదీన సందర్భంగా శ్రీరాంపూర్‌ సీఈఆర్‌ క్లబ్‌లో జరిగే వేడుకల్లో బహుమతులు అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సంయుక్త కార్యదర్శి రత్నకళ, సభ్యులు మంజుల, సునీత, తులసీ, లలితా, మౌనిక, శార ద, తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రి రూరల్‌ : మహిళలు అన్నిరంగాల్లో రాణించి శక్తిని చాటాలని సింగరేణి పాఠశాల హెచ్‌ఎం ఎం వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవా రం పాఠశాలలో టీచర్లకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ ఇంటి కే పరిమితం కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ముందుండాలన్నారు. త్రోబాల్‌, టెన్నికైట్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, అంత్యాక్షరి, మ్యూజికల్‌ చైర్‌, వ్యాస రచన, ఉపన్యాస పోటీ లు నిర్వహించారు. సిబ్బంది శ్రీమతి, లలితాకుమారి, జీ దేవమ్మ, ఎం. ఝాన్సీరాణి, హెచ్‌ రేణుక, ఆశాజ్యోతి, కల్పలత, ఎన్‌ అనుపమ, కేపీ సెల్వి, స్వరూప, తేజశ్విని, శారద, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>