శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 06, 2020 , 23:15:59

కరోనాపై వదంతులు నమ్మద్దు..

కరోనాపై వదంతులు నమ్మద్దు..

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ:కరోనా వైరస్‌పై వదంతులను నమ్మొద్దని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లాల్‌ అగర్వాల్‌ సూచించారు. ఢిల్లీ నుంచి ఆయన జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితి, మన దేశంలో ఉన్న కేసులు, చికిత్సను వివరించారు. కరోరా వైరస్‌ రాకుండా, ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ప్రజలు భయాందోళన చెందకుండా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, సునీల్‌రావు, సీతారాం, ప్రేమ్‌సాగర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


logo