బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 06, 2020 , 00:18:01

దవాఖాన ఉండేది ఇలాగేనా?

దవాఖాన ఉండేది ఇలాగేనా?

వాంకిడి: ప్రభుత్వ దవాఖాన ఉండేది ఇలాగేనా.. ఇలా అ పరిశుభ్రంగా ఉంటే రోగులు ఎలా వస్తారని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా వైద్యసిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను గు రువారం తనిఖీ చేశారు. దవాఖానలో ఓపీ, ల్యాబ్‌ సహా ప్రతి గదిని తిరిగి పరిశీలించారు. రికార్డులు సక్రమంగా ని ర్వహించాలనీ, పొరపాట్లు చేస్తే సహించేది లేదని హెచ్చరిం చారు. దవాఖాన పరిశుభ్రంగా ఉంచాలనీ, వార్డుల్లో  కిటికీ లకు దోమ తెరలు ఏర్పాటు చేయాలని సూచించారు. దవాఖానకు వచ్చే మందుల రికార్డులు, కేసీఆర్‌ కిట్లను ఇప్పటి వరకూ ఎంత మందికి పంపిణీ చేశారో పూర్తి వివరాలు రి కార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. వైద్యసిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. దవాఖానలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. దవాఖానకు స్థలం విరాళం ఇచ్చి 40 ఏళ్లు కావస్తున్నా, నేటి వరకూ ప్రభుత్వ భూమిగా బదలింపు చేయకపోవడంపై తాసిల్దార్‌ రాం మోహన్‌రావు పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్థలం బదలాయింపు చే యాలని ఆదేశించారు. 


పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి

ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. వాంకిడిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ గురువారం తనిఖీ చేశారు. కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరాతీశారు. విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 


జీవనోపాధికి రుణాల మంజూరు 

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: జీవనోపాధికి సబ్సిడీతో రుణాలు మంజురు చేస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మం దిరంలో డిస్ట్రిక్‌ ఇండస్ట్రీస్‌ అనుమతి కమిటీ( డీఐపీసీ) స మావేశాన్ని సంబంధితశాఖల అధికారులతో గురువారం  నిర్వహించారు. కేవీసీ, పీఎంజీఐ ద్వారా సబ్సిడీ రుణాల ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కులాల కు చెందిన ఎంపికైన లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీతో , ఇతర కులాలకు చెందిన ఎంపికైన లబ్ధిదారులకు 25 శా తం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మొదటి, మూడో గురువారం సమావేశాన్ని నిర్వహిం చాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో సం బంధిత అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>