సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 06, 2020 , 00:14:47

పట్టణం ప్రగతి బాట

పట్టణం ప్రగతి బాట

కాగజ్‌నగర్‌ టౌన్‌: పల్లె ప్రగతి తరహాలో శ్రీకారం ‘పట్టణ ప్రగతి’కి ఉత్సాహంగా సాగింది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఫిబ్రవరి 24 నుంచి 10 రోజుల పాటు నిర్వహించగా, నిరంతరాయగంగా కొనసాగిం ది. పట్టణంలోని 30 వార్డుల్లో 30 మంది ప్రత్యేకాధికారులు వాడవాడలా కలియదిరిగారు. పారిశుధ్య సిబ్బందితో మురుగు కాలువలు శుభ్రం చేయడం, పూడికతీయడం, రోడ్లకిరువైపులా పిచ్చి మొక్కలను తొలగించడంలాంటివి చేపట్టారు. ఉ దయం 8 గంటల నుంచి అదనపు కలెక్టర్‌ రాంబా బు, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌ చైర్మ న్‌ గిరీష్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు, సిబ్బంది కాలినడకన వెళ్లి తిరుగుతూ ప్రజలను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, ఖాళీ స్థలాలు, నర్సరీలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, బావు లు, ఇనుప స్తంభాలు, తదితర వివరాలు సేకరించి నివేదికలు తయారు చేశారు.


ఎమ్మెల్యే పర్యటన..

మొదటి రోజు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు నం.7 సంజీవయ్య కాలనీ, వార్డు నం. 22 మార్కెట్‌ ఏరియా, వార్డు నం. 23లో కలియ తిరుగుతూ సమస్యలను తెలుసుకొని.. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సంజీవయ్య కా లనీలో రోడ్డుకు మధ్యలోనే విద్యుత్‌ స్తంభం ఉండడంతో దానిని తొలగించారు. మార్కెట్‌కు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా తాగు నీటి సౌక ర్యం కల్పించారు. సులభ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు.

 

కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ

జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ కావడంతో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ రాం బాబు ప్రత్యేక చొరవ చూపారు. వాడవాడకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఇబ్బందులేమైనా ఉన్నా యా.. అని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి ప నులను గుర్తించి.. వెంటనే చేపట్టాలంటూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చొరవతో పట్టణం పురోగతి సాధిస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


రూ.68.38కోట్లు అంచనా వ్యయం

కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణంలోని 30 వార్డుల్లో స మస్యలను అధికారులు గుర్తించారు. ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను ప్రత్యేకాధికారులు పరిశీలించి నివేధికలను మున్సిపల్‌ కార్యాలయంలో అందజేశారు. గురువారం పను ల అంచనా వ్యయాలను సిద్ధం చేశారు. సీసీ, బీటీ, డబ్ల్యూబీఎం, కచ్చా రోడ్లు, సీసీ డ్రైనేజీలు, స్టోన్‌ మెసనరీ, కల్వర్టులు, వీధి దీపాలు, బోర్‌వెల్స్‌, పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌, పబ్లిక్‌ నల్లాలకు కలిపి అంచనా వ్యయం రూ. 68.38 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. 


logo