గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 04, 2020 , 23:57:55

పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పట్టణ అభివృద్ధికి  ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు పిలుపుని చ్చారు. పట్టణ ప్రగతి ఆఖరి రోజు కార్యక్రమంలో భా గంగా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 25, 26, 27 వార్డుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, కమిషనర్‌ తిరుపతితో కలిసి పర్యటించారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు 10 రోజుల పాటు పట్టణంలోని 30 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రత్యేకాధికారులు, స్థానిక నాయకులు కాలనీల్లో ఉన్న సమస్యలను అభివృద్ధికి అవసరమైన వివరాలను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆఖరి రోజు కాలనీలో కాలినడకన తిరుగుతూ శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీలు ఉన్న చోట కొత్తవాటి నిర్మాణం, అంతర్గత రో డ్ల  నిర్మాణం కోసం కాలనీలో ప్రాంతాలను పరిశీలించామన్నారు. 


నౌగాం బస్తీలో ఉన్న కాలువ వర్షాకాలం లో నిండి ఇండ్లలోకి వరద వస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి సమస్య ను పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పలువురు కాలనీవాసులు సమస్యలపై అదనపు కలెక్టర్‌ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. కాలనీలోని మంచినీటి బావులపై జాలి నిర్మాణం, నీరు నిలిచిన ప్రదేశాల్లో, కాలువల్లో గంబూసియా చేపలను వే యాలని అధికారులను ఆదేశించారు.  సమస్యలు ఏమై నా ఉంటే నేరుగా మున్సిపల్‌ కార్యాలయంలో, స్థానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్‌ డీఈ గోపాల్‌, మున్సిపల్‌ అధికారులు క్రాంతి, లింగన్న, సతీశ్‌, కౌన్సిలర్లు సుజాత, నాయకులు ప్రసాద్‌, వసీం, తదితరులున్నారు. logo
>>>>>>