మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Mar 04, 2020 , 23:54:39

మొదటి రోజు ప్రశాంతం

మొదటి రోజు ప్రశాంతం

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు తొలి రోజు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.  ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రా లను ఇందుకోసం ఏర్పాటు చేశారు. జనరల్‌లో 3,950 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 3,840 మంది హాజరయ్యారు. 110 మంది మంది గైర్హాజర య్యారు. అలాగే ఒకేషనల్‌లో 808 మందికి, 725 మంది హాజరయ్యారు. 83 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో గోపాల్‌ నాయక్‌ తెలి పారు. ఎక్కడ కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు. కాగజ్‌నగర్‌లో 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సిబ్బంది అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి వెనుదిరిగింది.


logo
>>>>>>