గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 03, 2020 , 23:48:17

పరీక్షా కాలం

పరీక్షా కాలం
  • జిల్లావ్యాప్తంగా 17 కేంద్రాలు
  • హాజరుకానున్న 8,656 మంది విద్యార్థులు
  • సెంటర్ల వద్ద 144 సెక్షన్‌
  • సమీప ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్ల మూసివేత
  • నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
  • ఈ నెల 19 నుంచి పదో తరగతి ఎగ్జామ్స్‌
  • ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకూ డీఎడ్‌ ప్రథమ సంవత్సరం..

పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశించే ‘పరీక్షా’ కాలం ఆసన్నమైంది.  నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా, 19 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పదో తరగతి, ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు డీఎడ్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇక బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియెట్‌ ఎగ్జామ్స్‌కు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ కొనసాగనున్నాయి. ప్రథమ సంవత్సరంలో 4646 మంది, ద్వితీయ సంవత్సరంలో 4010 మంది విద్యార్థులు హాజరు కానుం డగా, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామనీ, గంట ముందే హాళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనుం డగా, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డ, సహకరించిన వారిపై చర్యలు తప్పవని ఇంటర్మీడియెట్‌ అధికారి గోపాల్‌ హెచ్చరిస్తున్నారు.                    - ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ


ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్చి వచ్చిందం టే చాలు పరీక్షల సమయం ఆసన్నమైనట్లే . నేటి నుంచి ఈ నెల 20 వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్ష లు నిర్వహించనున్నారు. మార్చి 19 నుంచి ఏప్రి ల్‌ 6 వరకు పదో తరగతి, ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు డీఏడ్‌ పరీక్షలు జరుగునున్నాయి. మూ డు నెలల పాటు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమ గ్నమయ్యారు. గతంలో కంటే ఈ విద్యా సంవత్స రం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ప్ర ణాళికతో ముందుకెళ్తున్నారు. 


వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

ప్రభుత్వ కళాశాలల్లో ఉదయం, సాయంత్రం ప్ర త్యేక తరగతులు నిర్వహించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణ సాధించడమే లక్ష్యంగా, వారి కి ముందుగా పరీక్షలంటే భయాన్ని వీడేలా అవగా హన కార్యక్రమాలు నిర్వహించారు.


నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్‌ పరీ క్షలు సజావుగా సాగేలా అధికారులు ఏర్పాట్లు పూ ర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటలకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించారు. ఫర్నిచర్‌, తాగు నీరు, విద్యుత్‌ తదితర ఏర్పాట్లతో పాటు వై ద్య సదుపాయం కల్పించనున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. పరీక్షా సమయంలో ఆర్టీసీ ఆధికారులు బస్సు సౌకర్యం కల్పించనున్నా రు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయను న్నారు. కేంద్రాలకు మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావద్దని జిల్లా ఇంటర్‌ ఆధికారి గో పాల్‌ సూచించారు. పరీక్షల విధానంపై విద్యార్థులకు ముందుగానే కళాశాలల్లో అవగాహన కల్పించారు. జిల్లాలో 17 కేంద్రాలను ఏర్పాటు చేయ గా, 8,656 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజ రు కానున్నారు.  ఇందులో 4,646 మంది ప్రథ మ సంవత్సరం, 4,010 మంది రెండో సంవత్స రం విద్యార్థులు  ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్య మైనా పరీక్షలకు అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. 


ఈనెల 19 నుంచి ‘పది’ పరీక్షలు

ఈ నెల 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారం భం కానున్నాయి.  ఇప్పటికే పరీక్షా కేంద్రాలను గుర్తించి, ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విద్యార్థు లకు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించనున్నారు. ఏప్రిల్‌ 6 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉ దయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 15 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలో 35 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ పాణిని తెలిపారు. 35 మంది సీఎస్‌లు, 35 మంది డీవో లు, 35 మంది సిట్టింగ్‌ స్కాడ్స్‌ను ఏర్పాటు చేశా రు. వీరితో పాటు 2 బృందాల ఫ్లయింగ్‌ స్కాడ్‌ ను నియమించారు.


డీఎడ్‌  ప్రథమ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఇప్పటికే డీఎడ్‌ వార్షీక పరీక్షల షెడ్యూల్‌ను ప్రభు త్వం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల నిర్వహ ణ అధికారి ఉదయ్‌బాబు తెలిపారు. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతా యన్నారు. 


పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నాం

 జిల్లాలో  ఇంటర్మీడియెట్‌, పదో తరగతి, డీఏడ్‌ పరీక్షల కు ఏ ర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల మేరకు కేం ద్రాలను ఎంపిక చేశా. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం.

-ఉదయ్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌,ఆసిఫాబాద్‌


ఉత్తమ ఫలితాలపై ప్రత్యేక దృష్టి

ఇంటర్మీడియెట్‌లో గతేడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించేందు కు కృషి చేస్తున్నాం.  వంద శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థులను సిద్ధం చేశారు. ప్రత్యేక తరగతులు నిర్వ హించి విద్యార్థులకు వారి సందేహాలను నివృత్తి చేశారు.   ఈ సారి ఫలితాల్లో జిల్లాలో ఉత్తమ స్థానంలో నిలుస్తుందనే నమ్మకం ఉంది.

-గోపాల్‌ ,ఇంటర్మీడియెట్‌  అధికారి


పిల్లలను ప్రోత్సహించాలి

పిల్లలు పరీక్షలు బాగా రాసేలా  తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్ర త్తలు తీసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.ఈ సారి మెరుగై న ఫలితాలు సాధించాలన్నదే మా లక్ష్యం.

-పాణిని, జిల్లా విద్యాశాఖ అధికారి


మెరుగైన ఫలితాలే లక్ష్యం

ఇంటర్‌ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధిం చడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకె ళ్తున్నాం.  విద్యార్థు లం తా ఎలాంటి భయాందో ళన లేకుండా పరీక్షలకు హాజరవ్వాలి.  ఫేజ్‌-I, ఫేజ్‌- IIలో విద్యార్థుల కు ప్రత్యేక తరగతులు, నమూనా పరీక్షలు నిర్వహిం చాం. పూర్తి స్థా యిలో విద్యార్థులను సిద్ధం చేశాం. తప్ప కుండా మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది.  ఈ రోజు నుంచి ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న  పిల్ల లందరికీ అల్‌ ది బెస్ట్‌

- లక్ష్మయ్య, ఆర్సీవో


శ్రద్ధగా చదివాం..

మంచి మార్కులు సాధించాలనే లక్ష్యంతో శ్రద్ధగా చదివాం. గురు కులంలో మా అధ్యాప కులు ప్రత్యేక శ్రద్ధ తీసు కున్నారు. ప్రతి రోజు స్టడీ అవర్స్‌ నిర్వహించి ప్రత్యేక పరీక్షలు నిర్వ హించారు.  ప్రతి విష యాన్ని అర్థమయ్యేలా వివరించారు. మంచి మార్కులు సాధిస్తామనే నమ్మకం మాలో కలిగించారు. ప్రతి విద్యార్థిలో భయాన్ని తొలగించారు. ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

-స్వప్న, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని


logo
>>>>>>