గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 03, 2020 , 23:36:16

పట్టణ ప్రగతిలో భాగస్వాములవ్వాలి

పట్టణ ప్రగతిలో భాగస్వాములవ్వాలి
  • కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా
  • కాగజ్‌నగర్‌లోని పలు వార్డుల సందర్శన
  • సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

కాగజ్‌నగర్‌ టౌన్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం కాగజ్‌నగర్‌లోని 17,18,19 వార్డుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నిజాముద్దీన్‌ కాలనీలో ఇరుకైన రోడ్లు, కాలువలు సరిగ్గాలేవని, కాలనీ వాసులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.  ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ డీఈ, ఏఈలకు సూచించారు. ఓ వృద్ధురాలు తన సమస్యను పరిష్కరించాలని వేడుకోగా కమిషనర్‌ తిరుపతితో వృద్ధాశ్రమాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తైబానగర్‌ కాలనీలో పర్యటించారు. కాలనీకి అనుకొని ఉన్న రైల్వే కాలువ గోడతో తమకు ఇబ్బందులు ఉన్నాయని, వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వస్తున్నాయని కాలనీవాసులు తెలపడంతో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అశోక్‌కాలనీలోని బావిని పరిశీలించి బావికి జాలి నిర్మించాలని, బావిలో నీటి మట్టం ఎంత ఉందో ఓ రాయిని వేసి పరిశీలించారు. కాలనీల్లో వీధి దీపాలు లేక రాత్రివేళలో ఇబ్బందులు పడుతున్నామని తెలపడంతో విద్యుత్‌ స్తంభం ఏర్పాటు చేయాలని విద్యుత్‌, మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమున్న చోట తాగునీటి కులాయిలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇప్ప స్వప్నకు వితంతువు పింఛన్‌ మంజూరు చేయాలనీ, తన కుమారుడు మానసిక దివ్యాంగుడు అయినందున వికలాంగ పింఛన్‌ అందేలా చూడాలని కోరగా ఆసిఫాబాద్‌లో నిర్వహించే సదరమ్‌ శిబిరానికి వారిని తీసుకొని రావాలని తాసిల్దార్‌ ప్రమోద్‌ను ఆదేశించారు. వెంటనే తాసిల్దార్‌ వివరాలు నమోదు చేసుకున్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ రాంబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, కౌన్సిలర్లు కిర్తిరేఖ, అన్నబోయిన లావణ్య, రాంటెంకి ఝాన్సీ, సాహీన్‌ సుల్తానా, జూపాక మదన్‌, విజయ్‌ యాదవ్‌, డీఈ గోపాల్‌, ఏఈ సతీశ్‌, క్రాంతి, ప్రత్యేక అధికారులు, కాలనీ వాసులు నారాయణ, రాజనర్సు ఉన్నారు.logo