గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 02, 2020 , 23:33:50

ఆర్థిక గణన షురూ

ఆర్థిక గణన షురూ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా ప్రజల ఆర్థిక స్థితిగతులు.. ఆదాయ వనరులపై సర్వే ప్రారంభమైంది. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా  నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఈ సర్వేను చేపడుతోం ది. జిల్లాలోని 15 మండలాల పరిధిలోని 334 గ్రా మ పంచాయతీల్లో సమగ్రంగా నిర్వహించనున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనున్నది. 

పారదర్శకంగా పథకాల అమలుకు..

ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలంటే వారి ఆర్థిక స్థితిగతులపై సరైన ఆధారాలు ఉండాలి. అలాంటప్పుడే పారదర్శకంగా పథకాలు అందించే వీలుంటుంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతోనో... పైరవీలతోనో లబ్ధి పొందాలనుకునే అనర్హులకు చెక్‌పెట్టే వీలుకలుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితులపై పకడ్బందీగా సర్వే చేసేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఆర్థిక గణన సర్వే ఇప్పటికే బెజ్జూర్‌ మండలంలోని కుకుడ, ఊట్సారంగపల్లి, పెద్దసద్దాపూర్‌ గ్రామ పంచాయతీల్లో పూర్తయ్యింది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఇంటింటా సమాచారం సేకరణ..

జిల్లాలోని ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతుల వివరాలను పూర్తిగా సేకరిస్తున్నారు. ప్రజల జీవన సరళి, సంపాదన, ప్రధాన వృత్తి, వారికున్న వాహనాలు, భూములు, ఇతర ఆదాయ వనరులు, కుటుంబానికి ఉన్న ఆదాయ వివరాలతో పాటు వారి ఖర్చుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా అంచనా వేసేలా గణన చేపడుతున్నారు. 15 మండలాల్లోని 334 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి గ్రామంలో సర్వే చేపట్టనున్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని సర్వే చేస్తారు. కుటుంబంలోని వ్యక్తులు, వారు చేసే పనులు, వారికి వచ్చే ఆదాయాలు, భూముల వివరాలు అన్ని సేకరిస్తారు. సాధారణ చిన్న దుకాణం నిర్వహించే వ్యక్తి నుంచి పట్టణాల్లో పెద్ద వ్యాపార సంస్థల వరకు అన్నింటినీ సర్వే చేసి ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు సర్వేల్లో నిమగ్నమయ్యారు.

మండలానికో పర్యవేక్షకుడు

జిల్లాలో ప్రజల ఆర్థిక గణనను పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల జీవనాధారం ఏమిటి, ఆదాయ మార్గం, ఏ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు. వీరంతా ఏ పనిచేస్తున్నారు, ఇంటి పెద్ద ఎవరు.. ఇలా మొత్తం 13 అంశాల ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. నివాస-వాణిజ్య, పూర్తి వాణిజ్య భవనాలుగా మూడు కేటగీరీలుగా చేసి ఆ దాయ వనరులను లెక్కిస్తారు. ఏడేళ్లకోసారి ఆర్థిక సర్వే (ఎకనామిక్‌ సెన్సెస్‌)ను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్రణాళిక, గణాంకశాఖ చేపడుతోంది. ప్ర జల ఆర్థిక జీవన విధానం, ఆర్థికస్థితిగతులపై ఈ స ర్వే ఎంతో ఉపయోగపడనున్నది. ప్రజల జీవన ప్ర మాణాలు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారాలు, కూలీల జీవన విధానం వారి జీవన స్థితిగతులపై స్పష్టత రానున్నది. సర్వేకోసం ప్రత్యేకంగా 200 మంది ఎన్యుమరేటర్లును నియమించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ సర్వే జరుగనున్నది. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అంచనాలు గ్రామాల్లో ఎన్యుమరేటర్లు 13 అంశాల ఆధారంగా సేకరించిన వివరాలు ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫక్షన్‌ ద్వారా ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. ప్రతి ఇంటిని జియోట్యాగింగ్‌ చేస్తారు. సర్వే జరిపిన ప్రతి ఇంటికి ఈసీ (ఎకనామిక్‌ సెన్సెస్‌) నంబర్‌ను ప్రత్యేకంగా కేటాయించి తలుపులపై రాస్తారు. పేదల అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందుకోసం ఏటా కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పేదలు, నిరుపేదలు (బిలోపావర్టీలైన్‌)లను గుర్తించి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికోసం పథకాలను అమలుచేసే వీలుకలుగుతుంది. సర్వేద్వారా వచ్చిన నివేదికల వివరాలు ప్రభుత్వం వద్ద యాప్‌లో ఉందుబాటులో ఉండనుండడంతో తప్పుడు ధ్రు పత్రాలతోపాటు, పైరవీలతో గాని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలనుకునే అనర్హుల ప్రయత్నాలకు చెక్‌పెట్టే వీలుకలుగుతుంది. ప్రభుత్వం చేపట్టనున్న ఆర్థిక గణన సర్వే ద్వారా రాబోయే రోజుల్లో అర్హులైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలన అమలు చేసే అవకాశం కలుగుతుంది. ఈ సర్వే ద్వారా దారిధ్య్ర రేఖకు దిగువన ఉ న్న వారి సమాచారం పూర్తిగా ప్రభుత్వానికి అందుబాటులోనికి రానున్నది.


logo
>>>>>>