బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 02, 2020 , 23:32:16

పట్టణ అభివృద్ధే ధ్యేయం

పట్టణ అభివృద్ధే ధ్యేయం

కాగజ్‌నగర్‌ టౌన్‌: ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 8, 9, 10 వార్డుల్లో సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. వార్డుల్లో పరిసరాలను పరిశీలించారు. డ్రైనేజీలు, రోడ్లు, పలు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అవసరమై కూ డళ్లలో తాగునీటి కులాయిలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకొని కట్టడాలు నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పలువురు మహిళలు పింఛన్‌ కోసం చైర్మన్‌ దృ ష్టికి తీసుకు రాగా కమిషనర్‌ తిరుపతిని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ గోపాల్‌, ఏఈ సతీశ్‌, ప్రత్యేక అధికారులు రామకృష్ణ, మక్బుల్‌ హుస్సేన్‌, మహ్మద్‌ నజుమొద్దీన్‌, కౌన్సిలర్లు వనమాల విజయరాము, మినాజ్‌,  నాయకులు, తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>