శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 02, 2020 , 23:29:40

మందమర్రిలో 91% ఉత్పత్తి

 మందమర్రిలో 91% ఉత్పత్తి

మందమర్రి రూరల్‌ : మందమర్రి ఏరియాలో ఫిబ్రవరి నెలలో 91 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు  జీఎం రమేశ్‌రావు తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని ఆర్‌కే 1ఏ, 100 శాతం ఉత్పత్తి అయినట్లు తెలిపారు. కేకే ఓసీ 122%, ఆర్‌కే ఓసీ 89 % సాధించగా, కేకే 5 గని 89 %, కేకే 1,  87 %, కాసిపేట-2 50 %, కాసిపేట 43 %, శాంతిఖని 38 % ఉత్పత్తి సాధించాయని వెల్లడించారు. శాంతిఖనిలో బోల్టర్‌ మైనర్‌ ప్రారంభమైనప్పటికీ ఫిబ్రవరి నెలల పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగలేదన్నారు. ముఖ్యంగా ఏరియాలో కార్మికుల గైర్హాజరు కారణంగానే ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. 35 శాతం కార్మికులు గైర్హాజరయ్యారని చెప్పారు. వారికి తెలిపాటి పనులు కల్పిస్తామని చెప్పినా విధులకు రావడం లేదని తెలిపారు. వీరి వల్ల వారి కుటుంబాలు  ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా సంస్థకు కూడా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. 

కోలిండియా స్థాయి పోటీలను విజయవంతం చేయాలి

రామకృష్ణాపూర్‌ ఠాగూర్‌ స్టేడియంలో నిర్వహించే కోలిండియా అథ్లెటిక్స్‌ పోటీలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. మైదానాన్ని చదును చేయడం, హద్దులు నిర్మించడం వచ్చే క్రీడాకారులకు భోజనం, వసతి ఏర్పాట్లు తదితర పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం వెంకటేశ్వర్లు, పీఎం మురళీధర్‌రావు, ఏరియా ఇంజినీర్‌ జగన్మోహన్‌రావు, ఏజెంట్‌ రాంచందర్‌, డీవై పీఎం రెడ్డిమల్ల తిరుపతి, డీవై సీఎంవో శౌర్య, డీవైజీఎం వర్క్‌ షాప్‌ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.  

బెల్లంపల్లి ఏరియాలో 76 %..

రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని గనులు ఫిబ్రవరి మాసంలో 76 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య తెలిపారు. బెల్లంపల్లి ఏరియా లోని గోలేటిటౌన్‌షిప్‌ లో గల జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ఏరియాలోని గనులకు ఫిబ్రవరిలో 4.00 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిర్దేశించగా 76శాతంతో 3.03 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీ లో 3.10 మిలియన్‌ టన్నులకు గాను 96శాతంతో 2.98 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని, బీపీఏఓసీపీటూ ఎక్స్‌టెన్షన్‌ గనిలో 0.90 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి గానూ 6శాతంతో 0.05 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఐ.లక్ష్మణ్‌రావు, డీవైపీఎం లోల్ల రామాశాస్త్రి, డీజీఎం(ఐఈడీ) యోహన, అధికారులు ఉన్నారు. 


logo