మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Mar 02, 2020 , 23:29:40

ఘనంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలు

 ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలు సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు కేక్‌ కట్‌ చేశారు. అర్బన్‌ గురుకుల పాఠశాలలో  విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌యాదవ్‌, వైస్‌ఎంపీపీ మంగ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌ గౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ అలీబీన్‌ హైమద్‌, నాయకులు ఆత్రం వినోద్‌, మంగ, సాయికృష్ణ, శైలేందర్‌, తారిక్‌, మల్లికార్జున్‌, కార్తీక్‌, గోపాల్‌ నాయక్‌, బాబురావు, తిరుపతి, దత్తు, శ్రీనివాస్‌, పెంటు, ప్రణయ్‌ కుమార్‌ పాల్గొన్నారు .ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ  లెటర్‌ ప్యాడ్‌తో పాటు పుష్పగుచ్ఛం సీఎంవో కార్యాలయం నుంచి పంపించారు. 

వాంకిడి: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు.  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలతో పాటు గ్లోబల్‌ మీడియా పాఠశాలలో విద్యార్థులకు చాక్లెట్లు, బి స్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బండే తుకారాం, వైస్‌ఎంపీపీ రాజుకుమార్‌, ఎంపీటీసీ ఉప్రే పితాబంర్‌రావు, అంబేద్కర్‌ సెంటర్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, నాయకులు ఎస్‌కే షఫిక్‌, దీపక్‌ పాల్గొన్నారు.

యువత సామాజిక స్పృహాతో ముందుకుసాగాలి

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: యువత సామాజిక స్పృహాతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం ఆత్రం సక్కు యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడంతో తోటి వారి ప్రాణాలను కాపాడిన వారు అవుతారన్నారు. యు వత రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండల టీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ కార్నాథం సంజీవ్‌కుమార్‌, కో ఆప్షన్‌మెంబర్‌ జౌరోద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నవీన్‌కుమార్‌జైస్వాల్‌, మోడెం సుదర్శన్‌గౌడ్‌, బోమ్మినేని శ్రీధర్‌, దుర్గం తిరుపతి, జుమ్మిడి ఆనందరావు, వోల్వోజి వెంకటేశం, పద్మ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


logo
>>>>>>