శనివారం 28 మార్చి 2020
Komarambheem - Mar 02, 2020 , 23:26:52

ఇంకుడు గుంతలు తప్పనిసరి

 ఇంకుడు గుంతలు తప్పనిసరి

పెంచికల్‌పేట్‌: ప్రతి ఇంటికి ఇంకుడుగుంత తప్పనిసరి గా నిర్మించుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్‌ సూచించారు.  మండలంలోని పోతెపల్లి గ్రామంలో ఇంకుడు గుంత నిర్మా ణ పనులను సోమవారం పరిశీలించారు. ఇంకుడు గుంత నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4513 అందజేస్తున్నదని తెలి పారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా కలిగే లాభాలను వివరించారు. ఎల్లూర్‌ గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దాసరి చంద్రమొగిళి, దుర్గం రాజ న్న, కార్యదర్శి శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బండి వెంకటచలం, తదితరులున్నారు. 

కౌటాల రూరల్‌:  ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని కౌటాల ఏపీఓ పూర్ణిమ అన్నారు.   కౌటాల మం డలంలోని వీర్ధండి గ్రామంలో ఆమె ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు ఇండ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు.  ఇంకుడుగుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గణేశ్‌, ఉపసర్పంచ్‌ బండు, తదితరులు పాల్గొన్నారు.


logo