గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 23:37:20

ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

కాగజ్‌నగర్‌టౌన్‌:  ప్రజల సహకారంతోనే పట్టణ ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.  పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్‌ రాంబాబు,  మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌తో కలిసి 12, 13, 28 వార్డుల్లో ఆదివారం పర్యటించారు. ఈ సం దర్భంగా ఆయన వాడవాడనా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యూ కాలనీలోని కల్వర్టు, డ్రైనేజీని శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలనీ, అవసరమైన చోట మట్టిని నింపి పూడ్చాలని సూచించారు. కాలనీ మ ధ్యలో ఉన్న ఐరన్‌పోల్స్‌ను వెంటనే తొలగించే ఏర్పాట్లు చే యాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. నౌగాం బస్తీలోని చేతిపంపు వద్ద నీరు రోడ్డుపైనే ప్రవహించడంతో కాలువలోకి మళ్లించాలని మున్సిపల్‌ అధికారులకు సూ చించారు. వంతెన నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సి ద్ధం చేయాలన్నారు. కాలనీలో ఉన్న అంబేద్కర్‌ భవన్‌ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పాటు చేయాలనీ, ఇండ్ల మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించాలన్నారు. 28వ, 12వ వార్డుకు మధ్యలో ఏర్పాటు చేసే కల్వర్టు పనులను పరిశీలించి డీఈ గోపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ పింఛన్‌ అందడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, జిల్లా కేంద్రంలో రెండు రోజులు సదరం క్యాంపు ఉంటుందనీ అర్హులైన వారిని గుర్తించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని ఆదేశించారు. పట్టణాన్ని సుం దరంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నా రు. వార్డు కౌన్సిలర్‌ సునీల్‌, శశికళ, సుజాత, మున్సిపల్‌ అధికారి సతీశ్‌, సాయికృష్ణ, తదితరులున్నారు. 


logo
>>>>>>