బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 23:32:42

రుణ ప్రణాళిక రెడీ..

రుణ ప్రణాళిక రెడీ..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా అభివృద్ధికోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణ ప్రణాళికలను సిద్ధం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1476.53 కోట్లు కేటాయించగా, 2020-21 సంవత్సరానికి రూ. 1537.43 కోట్లతో ప్రణాళికలు అమలు చేయనున్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 60.9 కోట్ల పెంచింది. 

రూ. 1537.43 కోట్లతో వార్షిక ప్రణాళికలు

జిల్లాలోని వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధికోసం రూ. 1537.43 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. గతేడాదితో పోలిస్తే స్వల్పంగా నిధులను పెంచిన ప్రభుత్వం ఈ ఏడాది రుణాలుగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. వార్షిక బడ్జెట్‌లో 90 శాతం నిధులన రైతులకు పంట రుణాలుగా ఇచ్చేందుకు కేటాయించారు. ఇదేకాకుండా వ్యవసాయ అనుభంద రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. రుణాలను సకాలంలో రైతులకు అందించడంతో పాటు పంటరుణాలకోసం కేటాయించిన నిధులను రైతులకు అందించి ఉత్పాదక పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

పంట రుణాలు కోసం 

రూ. 1106.68 కోట్లు

జిల్లాలోని రైతులకు పంటరుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రూ. 1106.68 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. పంటలు వేసుకునే సమయంలోరైతులు దళారులను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకు అధికారులు రుణాలను ఖరారు చేశారు. జిల్లాలోని బ్యాంకుల ద్వారా రైతులకు ఈ రుణాలను అందించనున్నారు. జిల్లాలో దాదాపు 93 వేల మంది రైతులు ఉన్నారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఏటా వీరు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఇచ్చే పంటరుణాలపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటారు. వానాకాలం సీజన్‌ పంటలు వేసే సమయానికి రుణాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటునారు. ఈ ఏడాది ప్రభుత్వం పంటరుణాలను ఇచ్చేందుకు చర్యలు చేపడుతుండటంతో రైతులకు కొంత మేలు కలుగునుంది.

అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం..

జిల్లాలో వ్యవసాయ రంగంతోపాటు దాని అనుబంధ రంగాలకు కూడా నిధులకు కేటాయించారు. బడ్జెట్‌లో 90 శాతం నిధులను పంటరుణాలకు కేటాయించిన అధికారులు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధులను కేటాయించారు. టర్మ్‌లోన్స్‌ రూ. 264.53 కోట్లు, ఎంఎస్‌ఈ రుణాలకు రూ. 70.44 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 95.78 కోట్లు కేటాయించారు. పంటరుణాలతోపాటు, దీర్ఘకాలిక రుణాలు, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి రుణాలు, ఇతర ప్రాధాన్యత, అప్రాధాన్యత రంగాలకు నిధులను కేటాయించి వాటిని ప్రోత్సహించనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 48 బ్యాంకులు ఉండగా, రాబోయే రోజుల్లో బ్యాంకుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.


logo
>>>>>>