గురువారం 09 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 23:31:22

సింగరేణి ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం

సింగరేణి ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం

శ్రీరాంపూర్‌ :  సింగరేణి సంస్థకు ఉత్పత్తితో పాటు ఉద్యోగుల రక్షణ, సంక్షేమం కూడా ముఖ్యమని శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం రాత్రి శ్రీరాంపూర్‌ ప్రగతీ స్టేడియం సీఈఆర్‌ క్లబ్‌లో సింగరేణి ఫ్యామిలీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సింగరేణి మహిళలకు, పిల్లలకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం ఫ్యామిలీ డే వేడుకలను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు గనుల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో అనేక ఒత్తిళ్లకు లోనవుతారని తెలిపారు. సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యం కోసం కార్మికులు చేస్తున్న కృషి లో వారి కుటుంబంలోని మహిళల సహకారం ఎంతో ఉందని తెలిపారు. ఫ్యామిలీ డే వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. సుమారు వెయ్యి మంది కార్మిక కు టుంబాల సభ్యులు ఒకే చోట వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందనన్నారు. కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేస్తున్నదని తెలిపారు. శ్రీరాంపూర్‌ ఏరియా గనులు సింగరేణిలో ఉత్పత్తిలో 112 శాతం సాధించి మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పా రు. అనంతరం సింగరేణి కళాకారులు, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సింగరేణి డే వేడుకల సందర్భంగా మహిళలకు నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు జీఎం దంపతులు బహుమతులు అందించారు. అనంతరం జీఎం లక్ష్మీనారాయణ, సేవా సమితి అధ్యక్షురాలు సరళాదేవి, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు సురెందర్‌రెడ్డి, ప్రాజెక్టు ఆఫీసర్‌ చింతల శ్రీనివాస్‌, ఏస్‌ఓ గుప్తా, దంపతులను, ఎస్‌ఓటూజీఎం కుమారస్వామి, డీవైజీఎం గోవిందరాజు, శివరావును పీఎం తుకారాం, క్లబ్‌ గౌరవ కార్యదర్శి శివకుమార్‌, కార్యదర్శి సిద్దంశెట్టి రమేశ్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ చాట్ల అశోక్‌, సేవా సమితి కార్యదర్శి కొట్టె జ్యోతి శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. జీఎం క్లబ్‌ సభ్యులకు జ్ఞాపికలు అందించారు. అనంతరం సహపంక్తి భోజనాలు (విందు) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, పీవీ రావు తదితరులు పాల్గొన్నారు. 


logo