సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 23:29:44

హక్కుల సాధనకు కలిసికట్టుగా సాగుదాం

హక్కుల సాధనకు  కలిసికట్టుగా సాగుదాం

బెజ్జూర్‌: హక్కుల సాధన కోసం ఆదివాసీ కొలాంవార్‌ (మన్నెవార్‌)  ఐక్యంగా ముందుకు సాగాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుర్శ పోశయ్య పిలుపుని చ్చారు. మండల కేంద్రంలో కొలాంవార్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ సందర్భంగా గ్రామం, మండల స్థాయిలో కమిటీలు ఏ ర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. కమిటీ స భ్యులను ఆయన ప్రకటించారు. గౌరవాధ్యక్షుడిగా మండిగె నారాయణ, అధ్యక్షుడిగా మండిగ చంటి, ఉపాధ్యక్షుడిగా బిబ్బెర రమేశ్‌, ప్రధాన కార్యదర్శిగాబిబ్బెర విలాస్‌, ప్రచార కార్యదర్శిగా గాపోల్క వెంకటేష్‌, సాంస్కృతిక కార్యదర్శిగా మండిగ సంతోష్‌, కోశాధికారిగా ఎడ్ల మహేశ్‌, సలహాదారుడుగా బోగా రం భీంరావుతో పాటు మరో 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్పెల్లి పో శం, రాష్ట్ర కార్యదర్శి బుర్రి శ్రీనివాస్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి మె ర్పెల్లి సదాశివ్‌, జిల్లా అధ్యక్షుడు మెర్పెల్లి బ్రహ్మయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ అర్షద్‌ హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సిడాం సకా రాం, నాయకులు డోకె వెంకన్న, జావీద్‌ అలీఖాన్‌, మాజీ సర్పంచ్‌ సుగుణ, తదితరులు పాల్గొన్నారు. 


logo