గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 00:59:18

ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవాలి

ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవాలి

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: జిల్లా ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వారితో డీసీసీ, డీఎల్‌ఆర్సీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ప్రణాళిక లక్ష్యం రూ.1537.43 కోట్లు నిర్ధేశించామన్నారు. ఇందులో క్రాప్‌ లోన్స్‌ రూ. 1106.68 కోట్లు, టర్మ్‌లోన్స్‌ రూ. 264.53 కోట్లు, ఎంఎస్‌ఈ రుణాలు రూ.70.44 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల్లో రూ. 95.78 కోట్లు నిర్ధేశించామని తెలిపారు. జిల్లాలో క్రాప్‌లోన్స్‌ రూ.560 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.33 కోట్లు, పారిశ్రామిక రుణాలు రూ.118 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల్లో రుణాలు రూ.216 కోట్లు, ఆప్రాధాన్యత రంగాల్లో రూ,117 కోట్లు మొత్తం జిల్లా ప్రణాళిక లక్ష్యం రూ.1296 కోట్ల 69 లక్షలకు గాను రూ.10 వందల 40 కోట్ల 40 లక్షలు (80.63 శాతం) వృద్ధి సాధించామని తెలిపారు. క్రాప్‌లోన్స్‌, టర్మ్‌లోన్స్‌ వందశాతం వృద్ధి సాధించాలని బ్యాంకర్లను ఆదేశించారు. అదే విధంగా సోషల్‌ సెక్యూరిటీ స్కీం చాలా తక్కువగా ఉన్నాయనీ, వీటీలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకంలో మొత్తం ఖాతాలో 10 శాతం ఖాతాదారులను నమోదు చేయించాలనీ, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 15 శాతం జిల్లాలోని ఖాతాదారులలో మార్చి 30లోగా నమోదు చేయాలన్నారు. 


సంబంధిత మండలాల ఏపీఎంలను ఒక్కొక్కరికి వెయ్యి మంది ఖాతాదారుల చొప్పున ఈ స్కీంలలో నమోదు చేయించాలన్నారు. జిల్లాలో మొత్తం 48 బ్రాంచులు ఉన్నాయని బ్యాంకు బ్రాంచులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వాటి సంఖ్య పెంచేందుకు ఎల్‌డీవో, ఆర్‌బీఐని మండలాల్లో ఎక్కడెక్కడ అవసమురన్నాయో గుర్తించి ఏర్పాటు చేయాలని సూచించారు. అకౌంట్‌ నంబర్‌లో మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. యూసీలు సకాలంలో అందించాలనీ, స్కిల్‌ , ఆన్‌స్కిల్డ్‌, లైన్‌ కన్సల్‌టెంట్లను 6వ తేదీలోపు పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు సాచురేషన్‌లో భాగంగా అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్‌ పథకంలో నమోదు చేయించాలన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డీవో ఆర్బీఐ సాయికిరణ్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ చెంచు రామయ్య, డీడీఎం పురోహిత్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


మిషన్‌ ఇంద్ర ధనుష్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: మిషన్‌ ఇంద్ర ధనుష్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మిషన్‌ ఇంద్రధనుష్‌లో భాగంగా డ్రాపౌట్‌ పిల్లలకు ఇమ్యూనైజేషన్‌ నాలుగో విడుత మార్చి రెండు నుంచి 13 వరకు వారం  పాటు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన పిల్లలకు టీకాలు వేయాలని సూచించారు. పాఠశాలల్లో ప్రార్థనా సమయంలో మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, డీఈవో పాణిని, డీడబ్ల్యూవో సావిత్రి తదితరులున్నారు.


సాగు విస్తీర్ణంపై  జాయింట్‌ వెరిఫికేషన్‌ చేయాలి

జిల్లాలో 50 శాతం సాగు విస్తీర్ణంపై వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, మండల స్టాటిస్టికల్‌ అధికారులు జాయింట్‌ వెరిఫికేషన్‌ చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. శనివారం ఏరియా రికాంక్షిషన్‌ సమావేశంలో వ్యవసాయ, ప్లానింగ్‌, ఉద్యానవన, ఇరిగేషన్‌ అధికారులతో కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమీక్షంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు విస్తీర్ణంపై జాయింట్‌ వెరిఫికేషన్‌  చేసి 15 రోజులోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. సమావేశంలో వ్యవసాధికారిణి భాగ్యలక్ష్మి, ఇరిగేషన్‌ అధికారి గుణవంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>