సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 00:55:33

పంచాయతీల అభివృద్ధే సర్కారు లక్ష్యం

పంచాయతీల అభివృద్ధే సర్కారు లక్ష్యం

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ : పంచాయతీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. శనివారం అంకుశాపూర్‌ గ్రామాన్ని ఆమె సందర్శించారు. ట్యాంకర్‌ను ప్రారంభించి పల్లె ప్రగతిలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోశారు. అనంతరం ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రజల సహకారంతోనే సమస్యలు పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. సర్పంచులు, అధికారులు సయన్వయంతో పని చేసి చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. చెత్తను రోడపై కాకుండా ట్రాక్టర్ల వెంటవెంటనే డంప్‌యార్డులకు తరలించాలని సూచించారు. డంప్‌, యార్డులు, శ్మ శాన వాటికలు ప్రతి గ్రామంలో నిర్మించేందుకు ప్రత్యేకంగా  నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. వేప, పూల చెట్లు నాటి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో  కెరమెరి జడ్పీటీసీ దృపాదాబాయి, సర్పంచ్‌ బానోత్‌ పార్వతీ, ఎంపీవో ప్రసాద్‌, ఉపసర్పంచ్‌ నాందేవ్‌, కార్యదర్శి సుమలత,తదితరులు ఉన్నారు.


logo