సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 29, 2020 , 00:00:32

కన్నోళ్ల కళ్లెదుటే..

కన్నోళ్ల కళ్లెదుటే..

జైనూర్‌: కన్నకొడుకు బాగా చదివి, ఉన్నతస్థాయికి వస్తాడని కలలు గన్న ఆ కన్నోళ్లకు, ఓ బాలుడు వారి కళ్లేదుటే ఆత్మహత్య చేసుకొని తీరని దుఖాన్ని మిగిల్చాడు. సిర్పూర్‌(యు) మండలంలోని పంగిడి గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్‌ శివదాస్‌(15) స్థానిక కుండాయి జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శివదాస్‌ జైనూర్‌ మండలంలోని పొచంలోద్ది ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతుండగా, ఇటీవల మానసిక సమస్యలు తోడయ్యాయి. 


దీంతో రెండు నెలల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు. ఇంటి నుంచే పాఠశాలకు వెళ్తున్నాడు. కాగా, గురువారం తండ్రి జయరాంతో కలిసి కుండాయి జలపాతం సమీపంలోని చేనుకు వెళ్లాడు. కాసేపటి తర్వాత తండ్రి ఇంటికి రాగా, శివదాస్‌ అక్కడే ఉండి జొన్న చొప్ప తొలగించే పనిలో నిమగ్నమయ్యాడు. సాయంత్రం ఆరు గంటలకు తండ్రికి ఫోన్‌ చేసిన శివదాస్‌, తనకు భయమేస్తుందని చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి జయరాం అక్కడికి చేరుకోగా, వారి కళ్లముందే శివదాస్‌ అరుస్తూ జలపాతంలోకి దూకాడు. శుక్రవారం సాయంత్రం మృతదేహం లభించింది. సీఐ జువ్వాజి సురేశ్‌, ఏఎస్‌ఐ అశోక్‌ ఘటనాస్థలికి గజ ఈతగాళ్లను రప్పించారు. logo