శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 27, 2020 , 23:44:39

నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

వాంకిడి : నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఈజీఎస్‌ సిబ్బందికి జడ్పీ సీఈవో వేణు సూచించారు. వాంకిడి మండలంలోని పాటగూడ గ్రామంలో ఈజీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని గురువారం  ఆయన పరిశీలించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలకు ప్రత్యేక బోర్డులు, చుట్టూ ఫెన్సింగ్‌, గేట్‌లను ఏర్పాటు చేయాలని ఈజీఎస్‌ సిబ్బందికి సూచించారు. నర్సరీలో వేసిన మొక్కలకు ప్రతిరో జూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా నీరు పోయాలనీ, వచ్చే జూన్‌ నాటికి వీటిని నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. మొక్కల పెంపకం, నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న శ్మశానవాటిక పనులను పరిశీలించి, వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట పాటగూడ సర్పంచ్‌ కోట్నాక కిష్టు, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌, టీఏ వెంకటేష్‌, తదితరులున్నారు.


పల్లెల అభివృద్ధికి కృషి చేయాలి..

పల్లె ప్రగతి పనుల ద్వారా పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ సీఈవో వేణు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో రెండో విడత పల్లె ప్రగతి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారాయనీ, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామగ్రామానా డంప్‌యార్డులు, అనుసంధానంగా కంపోస్ట్‌ షెడ్లు తప్పనిసరిగా నిర్మించాలని సూచించారు. అలాగే వైకుంఠధామాలు, ఇంకుడు గుంతలు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు చొరవ చూపాలన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పర్యవేక్షించి, 100 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఈజీఎస్‌ ఏపీవో షకీర్‌ ఉస్మానీ, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిసెంట్లు ఉన్నారు.


logo