గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 27, 2020 , 23:44:39

వృత్తి శిక్షణ కోర్సులను వినియోగించుకోవాలి

వృత్తి శిక్షణ కోర్సులను వినియోగించుకోవాలి

శ్రీరాంపూర్‌ : సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న వృత్తి శిక్షణ కోర్సులను వినియోగించుకోవాలనీ, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని నిరుద్యోగులకు శ్రీరాంపూర్‌ జీఎం లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం వద్ద  సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మోటార్‌ డ్రైవింగ్‌ శిక్షణను జీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  సింగరేణి ప్రాంత యవతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వృత్తి శిక్షణ కోర్సులను ఉచితంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. శిక్షణలో ప్రవీణ్యం సాధించాలనీ, స్వయం ఉపాధి పొందాలని సూచించారు. మహిళల కోసం టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం తదితర కోర్సుల్లో శిక్షణనిస్తున్నదని తెలిపారు. శిక్షణ పొందిన వారు సొంతంగా యూనిట్లు పెట్టుకొని, ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురెందర్‌రెడ్డి,  డీవైజీఎం గోవిందరాజు, చిరంజీవులు, రాజయ్య, శివరావు, ఎస్‌ఎస్‌ఓ రాఘవేంద్రరావు, పీఎం రాజేశ్వర్‌రావు, డీవైపీఎం తుకారాం, శిక్షకుడు మహేశ్‌ మోటార్‌ డ్రైవింగ్‌ శిక్షకులు శ్రీనివాస్‌, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి పీవీ రావు పాల్గొన్నారు. logo
>>>>>>