శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 27, 2020 , 23:42:48

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఓసీపీ భూనిర్వాసితులు, జాతీ య రహదారి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు  హా మీ ఇచ్చారు. గురువారం నస్పూర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు  కృష్ణాకాలనీ 3వ వార్డు, 8వ వార్డు పరిధిలోని తాళ్లపల్లి, సింగాపుర్‌ గ్రామాల్లో పర్యటించారు. ముందుగా ఆర్‌కే 6కాలనీలో కౌన్సిలర్లు పంబాల గంగాఎర్రయ్య, బెడిక లక్ష్మి వార్డుల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు, నస్పూర్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ తోట శ్రీనివాస్‌, ప్రత్యేకాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి భూనిర్వాసితులు ఎమ్మెల్యేను కలిసి వారి సమస్యలు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఈ సమస్యలపై విజ్ఞప్తి చేశామన్నారు. 363 జాతీయ రహదారి ఏర్పాటుతో సుమారు 230 నివాసాలు కోల్పోతున్నారనీ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించామని తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సంతృప్తి కర నష్టపరిహారం, ఇళ్ల స్థలాలిచ్చే వరకూ ఇళ్లు ఖాళీ చేయద్దని వారికి ఎమ్మెల్యే సూచించారు. సర్వేలో గల్లంతైన వారికి కూడా తిరిగి సర్వే చేసి నష్టపరిహారం ఇప్పిస్తామని వివరించారు. అనంతరం కృష్ణాకాలనీలోని అండ ర్‌ బ్రిడ్జివద్ద వర్షాకాలం నీరు నిలిచి రవాణా నిలిచి పోతుందని తెలిపారు. సింగరేణి అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురెందర్‌రెడ్డి, పట్టణ ప్రగతి సభ్యులు జక్కుల రాజేశం, కుమార్‌, లస్టెట్టి శ్రీనివాస్‌, నాసర్‌, పత్తి వెంకటేశ్‌, రాజమౌళి పాల్గొన్నారు. 

ఓసీపీ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి హామీ

నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సింగాపూర్‌, తాళ్లపల్లిలో పట్టణ ప్రగతిలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, నస్పూర్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కమిషనర్‌ అష్టకాల రాధాకిషన్‌, కౌన్సిలర్‌ బండారి సంధ్యారాణి సుధాకర్‌ పాల్గొని ప్రజలకు పట్టణ ప్రగతిపై వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఓసీపీ నిర్వాసిత కమిటీ సభ్యులు వారి సమస్యల వినతి పత్రం ఎమ్మెల్యే అందించారు. సర్వేలో గల్లంతైన వారి వివరాలు రికార్డులో సరిచేసి వారికి నష్టపరిహారం, ఇళ్ల స్థలాలిచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి జగదీశ్‌, జనార్దన్‌, అట్కపురం రాజలింగు, కుంట రామన్న తదితరులు పాల్గొన్నారు. 

22వ వార్డులో..

సీసీసీ నస్పూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. 22వ వార్డులో కౌన్సిలర్‌ వంగ తిరుపతి, ప్రత్యేక అధికారి సహజ ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని రాయల్‌ టాకీస్‌ ఏరియా చౌరస్తా, విద్యానగర్‌, న్యూరెడ్డికాలనీ, సీసీసీ మెయిన్‌ రోడ్లలో మురుగుకాలువలు శుభ్రం చేశారు. కాలనీల్లో ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేడం తిరుపతి, ఎంబడి సమ్మయ్య, వెంకటేశ్వర్లు, ఆకునూరి సంపత్‌కుమార్‌, శరవందం, పెంచాల వేణు, గంగన్న, గోపాల్‌, రాజవీరు, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo