శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 27, 2020 , T00:05

వేగం పెంచాలి..

వేగం పెంచాలి..

కాగజ్‌నగర్‌ రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ బల్దియాలో జోరుగా సాగుతోంది. మూడో రోజైన బుధవారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కాలనీలు, వీధులు తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. 4, 5, 6 వార్డుల్లో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ రాంబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌లు కాలనీల్లో కాలినడకన తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. వార్డు నంబర్‌ 5 సర్దార్‌ బస్తీలోని కాలనీల్లో మురుగు కాలువలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, దోమలు వస్తున్నాయని తెలుపడంతో కలెక్టర్‌ స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతికి సూచించారు. సర్దార్‌బస్తీలోని గల్లీగల్లీ తిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. మురుగు కాలువ నీటితో దుర్గందం వ్యాపిస్తుందని, కాలువ నిర్మాణం చేపట్టాలని కాలనీవాసీ తార కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ పరిశీలించి కాలువ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అలాగే బావుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని మున్సిపల్‌ ఎన్విరాల్‌మెంట్‌ ఇంజినీర్‌ ప్రణీత్‌కుమార్‌ను ఆదేశించారు. కాలనీ చివరలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్డిని పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ సమీపంలో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీపీబీవో సాయికుమార్‌ను ఆదేశించారు. కాలనీలో రెండు పబ్లిక్‌ ట్యాబ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు మహిళలు సూచించగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసకోలని అధికారులకు ఆదేశించారు. కాలనీల్లో మురుగు కాలువల్లో పూడిక తీత పనులు, పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలని, సమస్యలను గుర్తించి నివేదికలను అందజేయాలన్నారు. పట్టణంలోని కల్వర్టుల వద్ద చెత్తా చెదారం వేయకుండా ఇనుప జాలిని ఏర్పాటు చేయాలన్నారు. రైల్వేస్టేషన్‌ రోడ్‌ సమీపంలో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం ఎవరిదని తాసిల్దార్‌, ఆర్‌ఐని ఆరా తీశారు. రైల్వే స్టేషన్‌లో పట్టుకున్న రేషన్‌ బియ్యాన్ని ఈ భవనంలో వేసేందుకు ఉపయోగించేవారని తెలుపారు. భవనం ఆవరణలో అక్రమంగా ఇసుక నిల్వ ఉండడంతో దీనిక గేటు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం వార్డు నంబర్‌ 6లోని రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద ఉన్న మురుగు కాలనీల్లో పర్యటించారు. ఈ కాలనీల్లో మురుగు కాలువలు లేకపోవడంతో ఇండ్ల చుట్టూ మురుగు ఉండడంతో తక్షణమే బండలతో కాలువలు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇలా ఉంటే రోగాలు రావా లని అధికారులను ప్రశ్నించారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ల సాయంతో డంపింగ్‌ యార్డుకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్‌ ప్రమోద్‌కుమార్‌, ప్రత్యేక అధికారులు సత్యనారాయణ, రామకృష్ణ, మున్సిపల్‌ ఏఈ సతీష్‌కుమార్‌, ఆర్‌ఐ అశోక్‌, కౌన్సిలర్లు పిర్సింగుల జైచందర్‌, కాలనీవాసులు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

పట్టణ పరిశుభ్రత ముఖ్యం : సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభు త్వం పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని, అవసరమైన పనులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పట్టణంలో తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించడంతో తడి చెత్త భూమి లో కలిసిపోయి ఎరువుగా మారుతుందన్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ప్రజలను కోరారు. అధికారులు కాలనీల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు.


logo