శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 26, 2020 , 23:21:04

‘పల్లె ప్రగతి’ లక్ష్యాన్ని చేరుకోవాలి

‘పల్లె ప్రగతి’ లక్ష్యాన్ని చేరుకోవాలి

ఆసిఫాబాద్‌ టౌన్‌: ‘పల్లె ప్రగతి’ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీవోలతో పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై ప్రతి బుధవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. నర్సరీకి సంబంధించిన బ్యాగ్‌ ఫిల్లింగ్‌, విత్తనాలు నాటుట రెండు రోజుల్లో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇంకుడు గుంతలు, వైకుంఠధామాల నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 4,700 ఇంకుడు గుంతలు మాత్రమే పోగ్రేస్‌లో ఉన్నాయని, వారంలోగా 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అలాగే 335 గ్రామ పంచాయతీలకు గాను 204 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణాలు పనులు పురోగతిలో ఉన్నాయనీ, మిగిలిన 131 పంచాయతీల్లో పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీల కొనుగోలు పంచాయతీలకు అందజేసిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిల్లో నెలాఖరుకు లక్ష్యాన్ని పూర్తి చేయలన్నారు. మొక్కలను నాటిన నుంచి వాటి సంరక్షణ బాద్యత ఎంపీడీవోలదే అని గుర్తు చేశారు. తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ జిల్లాను మొదటి ర్యాంకులో ఉంచేలా పని చేయాలని సుచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీసీఈవో వేణు, డీఆర్డీవో వెంకట శైలేష్‌, డీపీవో రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo