బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 26, 2020 , 23:20:33

ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తాం

ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తాం

జైనూర్‌: మండల కేంద్రంలోని టైలర్‌ దుకాణ యజమాని పెట్కులే హుస్సేన్‌కు ప్రభుత్వం ద్వారా సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. రెండు రోజుల క్రితం పెట్కులే హుస్సేన్‌ టైలర్‌ దుకాణం దగ్ధం కావడంతో బుధవారం ఆయన సందర్శించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలు బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌కు అధైర్యపడోద్దని భరోసానిచ్చారు.  అనంతరం తక్షణ ఆర్థిక సాయం ఎమ్మెల్యే తన తరపున అందజేశారు. 

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల ఆపదలో ఉన్న వారి జీవితాలు కాపాడివారమవుతామని చెప్పారు. రక్తదానం చేసిన యువకులకు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అబుతాలిబ్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు చిర్లె లక్ష్మణ్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఫెరోజ్‌ఖాన్‌, మాజీ వైస్‌ఎంపీపీ షేక్‌ రషీద్‌, తాసిల్దార్‌ భుజంగ్‌రావ్‌, మండల వైద్యాధికారి నాగేంద్ర, సర్పంచులు పార్వతి లక్ష్మణ్‌, మడావి భీంరావ్‌, నాయకులుఅంబాజి, అజ్జులాల, షేక్‌ అబ్బు,  పవన్‌, లక్ష్మణ్‌, ఆదివాసీ మిత్ర వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఆడ వెంకటేశ్‌, వైద్యసిబ్బంది,  సభ్యులు పాల్గొన్నారు.


logo