మంగళవారం 07 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 26, 2020 , 23:19:48

513 మందికి క్వార్టర్ల కేటాయింపు

513 మందికి క్వార్టర్ల కేటాయింపు

శ్రీరాంపూర్‌ : సింగరేణి యాజమాన్యం ప్రగతి స్టేడియం సీఈఆర్‌ క్లబ్‌లో నిర్వహించిన సింగరేణి క్వార్టర్ల కేటాయింపు కౌన్సెలింగ్‌కు  విశేష స్పందన లభించింది. జీఎం లక్ష్మీనారాయణ, ఎస్‌ఓటూజీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో డీవైజీఎం గోవిందరాజు, క్వార్టర్ల కేటాయింపు కమిటీ ఆధ్వర్యంలో 513 మంది కార్మికులకు క్వార్టర్లు కేటాయించించారు. శ్రీరాంపూర్‌, నస్పూర్‌ ఏరియాలో 711 క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని యాజమాన్యం గుర్తించింది. క్వార్టర్ల కేటాయింపుకు శ్రీరాంపూర్‌ ఏరియాలో 2012 వరకు సీనియారిటీ కార్మికులు క్వా ర్టర్ల కేటాయింపుకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరింది. మొదటి రోజు సోమవారం 377 మందిని కౌన్సెలింగ్‌కు హాజ రు కావాలని కోరగా 278 మంది హాజరయ్యారు. ఇందులో సీనియారిటీ ప్రకారం 278 మందికి క్వార్ట ర్లు కేటాయించినట్లు డీవైజీఎం గోవిందరాజు ప్రకటించారు. 2వ రోజు 333 మం ది కౌన్సెలింగ్‌కు హాజరు కాగా 235 మంది కార్మికులకు క్వార్టర్లు కేటాయించారు. కార్మికులు మిగిలిన 198 క్వార్టర్లను తీసుకోవడానికి ముందుకు రాలే దు. రెండు రోజుల్లో 711 మంది కౌన్సెలింగ్‌కు హాజరు కాగా 513 మందికి క్వార్టర్లు తీసుకున్నారు. మిగిలిన 198 క్వార్టర్ల కేటాయింపుకు మరో 2 నెలల్లోగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని డీవైజీ ఎం గోవిందరాజు పేర్కొన్నారు. క్వార్టర్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించామని జీఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. డైలీ రేటెడ్‌ కార్మికులకు 60 శాతం, మంత్లీ రేటెడ్‌ కార్మికులకు 40శాతం ప్రకారం క్వార్టర్లు కేటాయించా మనీ, మొదటి సారిగా ఈ విధానం అమలు చేసినట్లు తెలిపారు.


logo