సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Feb 25, 2020 , 23:08:00

‘సహకారం’ ఏకగ్రీవం..

 ‘సహకారం’ ఏకగ్రీవం..

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కారు జోరు కొనసాగుతుండగా.. తాజాగా జరిగిన సహకార ఎన్నికల్లోనూ గులాబీదే గుత్తాధిప త్యం నడుస్తోంది. ఇటీవల జరిగిన పీఏసీఎస్‌ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో దూ సుకుపోగా.. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు పూర్తి ఆధిపత్యం సాధించారు. పీఏసీఎస్‌ ఎన్నికల్లో 95 శాతానికిపైగా డైరెక్టర్‌ పదవులను దక్కించుకోగా.. 77 పీఏసీఎస్‌లకు 72 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు. తాజాగా మంగళవారం డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరించారు. జిల్లా లో 20 డీసీసీబీ డైరెక్టర్లకు, పది డీసీఎంఎ స్‌ డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు స్వీకరించగా.. 18 డీసీసీబీ డైరెక్టర్‌ పదవులకు, 10 డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు సింగిల్‌ నా మినేషన్లు వచ్చాయి. మరో రెండు డైరెక్టర్‌ పదవులకు ఒక్క నామినేషన్‌ కూడా రాలే దు. ఎస్సీ కోటాలోని రెండు డైరెక్టర్‌ పదవులకు.. సంబంధిత రిజర్వేషన్‌ అభ్యర్థులు లేకపోవడంతో వీటిని వాయిదా వేశారు. 18 డీసీసీబీ, 10 డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే నామినేషన్‌ వేయగా.. అవి రిజర్వేషన్ల ప్రకారం సంఖ్యకు అనుగుణంగా నామినేషన్లు వే యడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన డీసీసీబీ, డీసీఎంఎస్‌ సంబంధించి 28 డైరెక్టర్‌ పో స్టులను టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు ఏకపక్షంగా దక్కించుకున్నారు.


ఏకగ్రీవంతో ఎన్నిక లేనట్టే.. 

పీఏసీఎస్‌లలో చైర్మన్లుగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఇద్దరు, బీజేపీ మద్దతుదారులు ముగ్గురు గెలువగా.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులకు మెజార్టీ అసలే లేకుండాపోయింది. దీంతో తాజాగా కాం గ్రెస్‌, బీజేపీల నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులకు నామినేషన్లు వేయలేదు. 28 డైరెక్టర్‌ పోస్టులకు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే నామినేషన్లు దాఖలు చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులను ఏకపక్షంగా, ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకోవడంతో ఈనెల 29న జరిగే డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే దక్కించుకోనున్నారు. ఈనెల 28న డీసీసీబీ డైరెక్టర్ల కో సం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రి జర్వేషన్ల సంఖ్య ప్రకారమే నామినేషన్లు రావడంతో 28 డైరెక్టర్‌ పోస్టులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 28న డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నిక లేకుండా పోయింది. ఈ నెల 29న డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పదవులకు ఈ నెల 29న నామినేషన్లు స్వీకరించి ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే మెజార్టీ ఉంది. కాంగ్రెస్‌, బీజే పీ నుంచి డైరెక్టర్లు లేకపోవడంతో టీఆర్‌ఎ స్‌ మద్దతుదారులే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను ఏకపక్షంగా, ఏకగ్రీవంగా దక్కించుకోనున్నారు. ఈ లెక్కన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లతోపాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు గంపగుత్తగా గులాబీ ఖాతాలో పడినట్లే.


డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులకు అ భ్యర్థులు ఎవరనే విషయంపై మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టి సారించారు. ఉ మ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మిగతా తొ మ్మిది మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మె ల్సీ, జడ్పీ చైర్మన్లతోపాటు ఇతర ముఖ్య ప్ర జాప్రతినిధుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నా రు. ఇప్పటికే నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమై చర్చించారు. పదవులు ఎవరికి ఇస్తే బా గుంటుందని అందరి అభిప్రాయాలను ప రిగణలోకి తీసుకుంటున్నారు. అందరి అ భిప్రాయాన్ని సేకరించి.. మెజార్టీ సభ్యుల మద్దతు మేరకే పేర్లను రాష్ట్ర నాయకత్వాని కి పంపాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తవగా.. తుది పేర్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. జిల్లా నుంచి పేర్లను రాష్ట్ర నాయకత్వానికి పంపాక.. అభ్యర్థి ఎవరనేది సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ మేరకు ఈ నెల 29లోపు అభ్యర్థులు ఎవరనేది అధిష్టానం పేర్లను ప్రకటించనుంది. ఆ ప్రకారమే ఈనెల 29న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఈ ఎన్నికలు కూడా ఏకగ్రీవం కానున్నాయి.


logo