మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 25, 2020 , 23:04:20

గుప్తనిధుల ముఠా పట్టివేత

గుప్తనిధుల ముఠా పట్టివేతపెంచికల్‌పేట్‌ : మండలంలోని పోతెపల్లి గ్రామ సమీపంలోని ఉచ్చమల్లివాగు ఒడ్డున వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ ముఠా గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది.  అర్ధరాత్రి ప్రాంతం లో ఆలయం వద్ద అనుమానాస్పదంగా కనిపించగా, గమనించిన కొందరు గ్రామస్తులు గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు. గ్రామస్తులతో ఆయన అక్కడికి చేరుకుని ముఠాను పట్టుకుని విచారించగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిపారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌సమాచారం అందించారు. ఎస్‌ఐ రమేశఖ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని క్షుద్రపూజలకు ఉపయోగించిన సామగ్రిని, ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ. 22 వేలు, గుప్తనిధులకు ఉపయోగించే డిటెక్టరీ యంత్రం, కారు (టీఎస్‌20ఎ3852), స్పెండర్‌ప్లస్‌ రిజిస్ట్రేషన్‌కాని ద్విచక్రవాహనంతో పాటు ఎనిమిది మంది ముఠాను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. మంగళవారం విచారణ జరపగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు విమాయిమండల్‌, శంకర్‌సర్కార్‌, నజ్రూల్‌నగర్‌కు చెందిన మరో ఆరుగురు ఉన్నారు. బీజేపీ ఎంపీటీసీ బికాస్‌ గరామి, చంప్‌మండల్‌, హనీస్‌మండల్‌, దిలీప్‌ బిస్వాస్‌, రామకృష్ణపాల్‌ ఉన్నారు. వీరిపై 279 సెక్షన్‌ నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.


logo
>>>>>>