బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 24, 2020 , 23:52:50

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

వాంకిడి: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో పూలాజీబాబా 4వ ధ్యాన కేంద్ర వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తిమార్గంలో నడవాలని సూచించారు. అప్పుడే కుటుంబంలో సుఖ:శాంతులు ఉంటాయని తెలిపారు. అంతకుముందు జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ పెంటయ్య, వాంకిడి సర్పంచ్‌ బండే తుకారాం, ఉపసర్పంచ్‌ పవన్‌సాయి, సరాండి సర్పంచ్‌ దుర్గం కమలాకర్‌, బంబార మాజీ ఎంపీటీసీ వినోద్‌తో కలిసి పూలాజీబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధ్యాన కేంద్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సంస్థాన్‌ పట్నాపూర్‌ అధ్యక్షుడు కేశవరావు, ధ్యానకేంద్ర మండలాధ్యక్షుడు సదశివ్‌, కమిటీ సభ్యులు నాగోషే శంకర్‌, సోమాజి, వాడై బాబురావు, పోశేట్టి  పాల్గొన్నారు.


యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. శివ్‌శంకర్‌ భవ్య జాతర పురస్కరించుకొని సోమవారం మండలంలోని గాడేమార్గ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను గిరిజన నాయకులతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని శివ్‌శంకర్‌ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గాడేమార్గ్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడి గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవేగూడ సర్పంచ్‌ బాలు, ఉపసర్పంచ్‌ సీడాం నానాజీ, వార్డు సభ్యులు రత్తుబాయి, గోవింద్‌రావు, గిర్జుబాయి, చందన్‌షావ్‌, తిరుపతి, సునీతబాయి, గ్రామస్తులు రాయిసీడాం మోతీరాం, సుభాష్‌  తదితరులు,పాల్గొన్నారు.


logo