మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 24, 2020 , 00:37:42

ఇక పట్టణ ప్రగతి

ఇక పట్టణ ప్రగతి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతి తరహాలో ప్రభుత్వం ‘పట్టణ ప్రగతి’కి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి పది రో జుల పాటు కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. పల్లెల్లో 30 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టినట్లుగానే.. మున్సిపాలిటీల్లోనూ పారిశుధ్య పనులు చేపట్టడం, తాగు నీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడం, రోడ్లకు మరమ్మతులు చేయడం, పాడుబడ్డ నిర్మాణాలను తొలగించండం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, శ్మశాన వాటికలు, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌జిమ్‌లు, డంప్‌ యార్డులు, పబ్లిక్‌ టాయిలెట్లు, వీధి వ్యాపారాల కోసం ప్రత్యేక ్థలాలను సిబ్బంది గుర్తించనున్నది. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో దిశానిర్దేశం చేసిన విషయం విదితమే.


కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల్లో..

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్‌ ము న్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ఈ నెల 24వ తేదీ నుంచి 10 రోజుల పాటు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పారిశుధ్య పనులతో పాటు పిచ్చిమొక్కల తొలగింపు, మురుగు నీటి గుంత లు పూడ్చడం, తాగు నీరు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించడం, రోడ్లకు మరమ్మతులు చేయడం, ఇంకుడు గుంతల ఏర్పాటు, పాడుబ డ్డ నిర్మాణాలను తొలగించం డం, హరితహారం లో భాగంగా మొక్కలు నాటడం వంటివి చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయనున్నారు. నిధుల సమీకరణ తదితర అంశాలపై సభల్లో వార్డు సభ్యులతో చర్చిస్తారు. తడి, పొడి చెత్తలకు వేర్వేరు బుట్టను వినియోగించడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను పూర్తి గా నిషేధించడం, వీధుల్లో, వ్యాపార సముదాయాల ఎదు ట చెత్త వేయడాన్ని నిషేధించడం అంశాలపై అవగాహన కల్పించనున్నారు.


వార్డుకో ప్రత్యేకాధికారి..

పట్టణ ప్రణాళికల్లో భాగంగా ప్రతి వార్డుని యూనిట్‌గా తీసుకుంటారు. వార్డుకో ప్రత్యేకాధికారిని నియమిస్తారు. మొత్తం మున్సిపాలిటీలో చేయాల్సిన పనులను గుర్తిస్తారు. పచ్ఛదనం, పారిశుధ్యానికి ప్రధాన్యతనిస్తారు. మొక్కలు నాటి హరితహారం ప్రణాళికలను అమలు చేస్తారు. మంచినీటి సరఫరాను పటిష్టం చేస్తారు. ప్రధాన రహదాలు, అంతర్గత రోడ్లు మెరుగుపరుస్తారు. గుంతలు పూడుస్తారు. దహన, ఖనన వాటికల స్థలాలను గుర్తిస్తారు. ముళ్ల పొదలను, తుమ్మలను తొలగిస్తారు. వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌జిమ్‌లు, డంప్‌ యార్డులు, పబ్లిక్‌ టాయిలెట్లు, వీధి వ్యాపారాల కోసం ప్రత్యేక స్థలాలను గుర్తిస్తారు. పార్కింగ్‌ స్థలాలు సేకరిస్తారు. అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తారు. హరితహారం పెంపుకు పట్టణాల్లో స్థలాలను గుర్తిస్తారు. స్థలం అందుబాటులో లేకుంటే సమీప గ్రామంలో గుర్తించి కేటాయిస్తారు.logo
>>>>>>