శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 21, 2020 , 23:30:43

హారో..హార

హారో..హార

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ:జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. కెరమెరిలోని వేంకటేశ్వర ఆలయం, వాంకిడి, సందీప్‌నగర్‌లోని శివాలయాల్లో జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రెబ్బెనలోని శివాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మితో కలిసి దర్శించుకున్నారు. తిర్యాణి, సందీప్‌నగర్‌లోని శివాలయాల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. కాగజ్‌నగర్‌ మండలంలోని ఈజ్‌గాం శివమల్లన్న ఆలయంలో ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు, కోనేరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ వంశీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్ర్తాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సిర్పూరు(టి) సివిల్‌ కోర్టు న్యాయమూర్తి బి.రామారావు దంపతులు, కాగజ్‌నగర్‌ డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి, ఆర్డీవో సిడాం దత్తు స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఏఎస్పీ వైవీఎస్‌ సుంధీద్ర ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు.


logo