ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 21, 2020 , 23:29:16

లక్ష్యం100 %

లక్ష్యం100 %

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పదో తరగతిలో ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో మెరుగైన ఫలితాల సాధనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతేడాది వచ్చిన రిజల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈయేడు వందశాతం సాధనకు పక్కా ప్రణాళికలో ముందుకెళ్తున్నది. ఇందుకోసం ప్రతిరోజు ఉద యం,  సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా మోడల్‌ టెస్ట్‌ లు నిర్వహిస్తూ పరీక్షలంటే భయాన్ని పోగొట్టడంతో పాటు, విద్యార్థులకు పరీక్షలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుతున్నారు. 


జిల్లాలో 167 పాఠశాలలు..

జిల్లాలో 167 పాఠశాలలుండగా, ఈ ఏడాది సు మారు 6 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో 100 శాతం ఫలితాలు సాధించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ నుంచి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో వసతి గృహాలు, ఆశ్రమాల్లో చదువుతున్న విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేయడంతో పాటు, వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే సిలబస్‌ పూర్తిచేయగా, జనవరి నుంచి రివిజన్‌ చేస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.


వందశాతం లక్ష్యం..

జిల్లాలో గతేడాది 6,347మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5312 మంది పాసు కాగా, ఉత్తీర్ణత శాతం 83.69 శాతంగా నమోదై రాష్ట్ర స్థాయిలో 28వ స్థానంలో నిలిచింది. ఈ యేడు జిల్లాలో లోకల్‌ బాడీల ఆధ్వర్యంలో 58 పాఠశాలలు, 2 ఆదర్శ పాఠశాలలు, 15 కస్తూరిబా గాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాలు, ఐటీడీఏ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు 42, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఐదు పాఠశాలలు, మూడు మైనార్టీ వెల్ఫేర్‌ పాఠశాలలు, ఒక కేంద్ర విద్యాలయం, నాలుగు పీవీటీజీ పాఠశాలలు, రెండు జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలతో పాటు జిల్లాలోని 35 ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నా రు. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా మెరుగైన ఫలితాల సాధనకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలను తీర్చిదిద్ధడంతో పాటు బోధన సిబ్బందిని నియమించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి సబ్జెక్టుకు సం బంధించిన ఉపాధ్యాయుడు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతీసుకొని ప్రత్యేకంగా చదివించడం, పరీక్షలకు సిద్ధం చేసే బాధ్యతలను అప్పగించింది. విద్యార్థులు వెనుకబడ్డ అంశాలను  ఎప్పటికప్పుడు బోధిస్తూ స్లిప్‌టెస్ట్‌లు పెడుతూ పరీక్షలంటే భయాన్ని పోగొడుతున్నారు. పబ్లిక్‌ పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా రాసేలా సిద్ధం చేస్తున్నారు.


logo