శనివారం 28 మార్చి 2020
Komarambheem - Feb 21, 2020 , 23:27:25

గౌడ కులస్తులను ఆదుకుంటాం

 గౌడ కులస్తులను ఆదుకుంటాం

తిర్యాణి : గౌడ కులస్తులను ఆదుకుంటామని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో మోకు దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించే గౌడ జన జాతర రెండో మహాసభ పోస్టర్‌ను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరవేణి నర్సగౌడ్‌తో కలసి ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లు గీతా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గౌడ కులస్తుల ప్రధాన సమస్యలను  ప్రభుత్వం గుర్తించిందనీ, అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తున్నదన్నారు. అనంతరం నర్సగౌడ్‌ మాట్లాడుతూ జిల్లా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు అనిల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే జనజాతర మహాసభను కులస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఎసీఎస్‌ చైర్మన్‌ చుంచు శ్రీనివాస్‌, గడలపల్లి ఎంపీటీసీ సారా రమేశ్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీ వెడ్మ కమల, సంఘం రాష్ట్ర కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు జవ్వాజి అనిల్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మార్క శంకర్‌ గౌడ్‌, మండల అధ్యక్షుడు బొమ్మగోని శంకర్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల వెంకటేశం గౌడ్‌, మండల యూత్‌ అధ్యక్షుడు జుంగోని అశోక్‌ గౌడ్‌, గౌడ సంఘం అధ్యక్షుడు పెరుమాండ్ల లచ్చా గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కులస్తులు ఉన్నారు.  


logo