గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 21, 2020 , 04:12:50

శివ పూజకు వేళాయె

 శివ పూజకు వేళాయె

శివుని పూజకు వేళయ్యింది. నేడు(శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలతో పాటు ప్రధాన ఆలయాల్లో రెండు రోజుల పాటు జాతర సాగనుంది.

శివుని పూజకు వేళయ్యింది. నేడు(శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలతో పాటు ప్రధాన ఆలయాల్లో రెండు రోజుల పాటు జాతర సాగనుంది. జిల్లాలోని ఈజ్‌గాం శివమల్లన్న ఆలయంతో పాటు రెబ్బెన, వాంకిడి, ఆసిఫాబాద్‌ మండలాల్లోని ఆలయాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. విద్యుద్దీపాలంకరణలు, మామిడి తోరణాలతో ఇప్పటికే ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. దేవాదాయ, ఆలయ కమిటీలు, మున్సిపల్‌, సింగరేణి, పోలీస్‌, ఇతర శాఖల ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లుచేశారు. క్యూలైన్లు, పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పలు ఆలయాల్లో అన్నదానం చేపట్టేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఏఎస్సీ సుధీంద్ర  ఆధ్వర్యంలో పోలీసుల  బందోబస్తు నిర్వహించనున్నారు. మంచిర్యాల జిల్లాలోని వేలాల, బుగ్గ క్షేత్రాలకు కూడా జిల్లా నుంచి వెళ్లే వారి కోసం బస్సులను నడిపిస్తున్నారు.

- నమస్తే బృందం


దహెగాం మండలంలోని లగ్గాం, దహెగాం, బీబ్రా, హత్తిని, కొంచవెల్లి, చిన్నరాస్పల్లి, గిరివెల్లి, తదితర  గ్రామాల్లోని ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లను   పూర్తి చేశారు. లగ్గాం గ్రామంలో శ్రీఉమాచంద్ర శేఖర స్వామి ఆలయాన్ని శివరాత్రి వేడుకలకు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. - దహెగాం

రెబ్బెన మండలం నంబాల గ్రామ శివారు లో ఉన్న శ్రీ ప్రసన్న పరమేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలోశ్రీ ప్రసన్న పరమేశ్వరాలయం ఉంది.  వేడుకల సందర్భంగా కల్యాణం, రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మండలం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యల భక్తులు తరలిరానున్నారు. అ సిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ నుంచి బస్సు సౌకర్యం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సౌకర్యాలు కల్పిస్తున్నది. నంబాల గ్రామంలో ఈ ఆలయం 64 ఏళ్ల క్రితం నిర్మించారు.  పరమేశ్వరుడితో పాటు  శ్రీ గణపతి, శివలింగం, పార్వతీదేవి, నందీశ్వరుడు, నాగేంద్రుడు, సూర్యుడు, అంజనేయస్వామి, నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. 


ఏర్పాట్లు పూర్తి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు ఏర్పాట్లు చేయా లని అడిషనల్‌ ఎస్పీ సుధీంధ్ర అన్నారు. జాతర ఏర్పాట్లను గురువారం  పరిశీలించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీకి పలు సలహాలు, సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మా నించారు. డీఎస్పీ సత్యనారాయణ, రెబ్బెన ఎస్‌ఐ దీకొండ రమేశ్‌, రెబ్బెన వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, నంబాల సర్పంచ్‌ చె న్న సోమశేఖర్‌, ఉపసర్పంచ్‌ గాంధార్ల అశోక్‌, ఆలయ కమిటీ ఛైర్మన్‌ గజ్జల శ్రీనివాస్‌ తదితరులున్నారు. 


ఆసిఫాబాద్‌జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్‌ శివాలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైం ది.  అలయ ముఖద్వారం శివపార్వతుల ప్రతిమలతో కొత్తగా నిర్మించి సిద్ధం చేశారు ఆలయానికి రంగులు వేయించారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6గంటలకు కలశ, గణపతి పూజ, 7గంటలకు పుణ్యావచనము, నిరంతర రుద్రాభిషేకం, సాయంత్రం 5గంటలకు గౌరీ పూజతోపాటు సాయంత్రం  గోధూళికా శుభలగ్న శుభముహుర్తమున శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు అలయ కమి టీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం భక్తులకు అన్నదానం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మం డలంలోని బురుగూడ శివాలయం, గుండి  ఆలయంలో వేడుకలకు పూర్తి ఏర్పాట్లు చేశారు. -ఆసిఫాబాద్‌ టౌన్‌


ఈజ్‌గాం శివమల్లన్న ఆలయంలో..  

ఈశ్వరుడి నామంతో వెలిసిన ఈజ్‌గాం శివమల్లన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేశారు. గణపతి, పార్వతి, విష్ణువు, సూర్యా ధిదేవతా మూర్తుల విగ్ర హాలు కొలువై ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో కాళభైరవుడు, వీరభద్రుడు, వీరాం జనేయ, మహాంకాళీ ఆలయాలు ఉన్నాయి. ఉత్తర ద్వారం వెలుపల సీతల దేవి కొలువై ఉంది. ఏ టా మహాశివరాత్రి  సందర్భంగా మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. జిల్లా నుంచే కాకుండా మంచిర్యాల, మహారాష్ట్ర నుంచి అధిక సం ఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శిం చుకుంటారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.  సుమారు 40 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున బారీకేడ్లు, క్యూ లైన్లు, శామియానాలను ఏర్పా టు చేశారు. ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. ఏఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర ఆధ్వ ర్యంలో డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం కాగజ్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో దు కాణ సముదాయాలు, ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యు ద్దీపాలతో అలంకరించడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. కాగా, ఏర్పాట్లను గురువారం ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్‌ విజయరామారావు పరిశీలించారు.  -కాగజ్‌నగర్‌ రూరల్‌బెజ్జూర్‌ రంగనాయక ఆలయంలో..


బెజ్జూర్‌ : మండల కేంద్రంలో రంగనాయక ఆల యంతో పాటు శివాలయం కూడా ఉన్నది.  మహా శివ రాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మండలం నుంచే కాకుండా మ హారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇందుకోసం నేటినుండి నిర్వహించే జాతర ఉత్సవా ల్లో భక్తుల ఉపవాస దీక్షలు, జాగారాలకు ఎలాంటి లోటు రాకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాత్రిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


బుగ్గ క్షేత్రంలో వేడుకలు 

బెల్లంపల్లి రూరల్‌ : బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీబుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా జాతర ఘనంగా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి 50వేల మంది భక్తులు తరలిరానుండగా, దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆలయానికి రంగులద్ది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పరిసరాలను చదును చేయించి భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటుచేశారు. కోనేరును శుభ్రం చేసి కొత్త నీటితో నింపారు. ప్రత్యేక దర్శనం కోసం రెండు క్యూలైన్లు సిద్ధం చేశారు. అంతటా సీసీ కెమెరాలు అమర్చారు. సింగరేణి యాజమాన్యం, బెల్లంపల్లి మార్వాడి యువమంచ్‌, విజయసేన స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు.

బెల్లంపల్లి నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో బుగ్గ ఆలయం ఉంది. బెల్లంపల్లి కాంటా, పాత బస్టాండ్‌ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. సాధారణ రోజుల్లో కన్నాల నుంచి అటవీ ప్రాంతం మీదుగా దేవస్థానానికి చేరుకోవచ్చు. సోమగూడెం, కాసిపేట, దేవాపూర్‌ గ్రామాల ప్రజలు యాప నుంచి బుగ్గగూడెం మీదుగా ప్రైవేటు వాహనాల్లో వెళ్లవచ్చు.


విగ్రహరూపంలో గుడిపేట్‌ సంగమేశ్వరుడు                                                                                                                     

తిర్యాణి మండలంలోని సుంగాపూర్‌ పంచాయతీ పరిధిలోని గుడిపేట్‌ గ్రామ శివా రులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండలపై బిల్వవనంలో సంగమేశ్వరుడు కొలువుదీరాడు. మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాచీన శివాల యం ఉంది. ఈ ఆలయంలో శివుడు, పార్వతి, గణపతి, ఆదిశేషుడు, నందీశ్వరుడు కొలువై ఉన్నారు. బృహ మహర్షి శాపం కారణంగా శివుడికి ఎక్కడా కూడా లింగాకార మే తప్పా విగ్రహ రూపం ఉండదు. కానీ ఇక్కడి శివాలయంలో సాక్షాత్తు పరమ శివు డి ఆకారం కొలువుదీరి ఉంటుంది. ఆలయానికి దక్షిణం వైపు ఉన్న బావిలో ఏకాలం లోనైనా నిరంతరంగా నిండుగా నీళ్లు ఉంటాయి. ఈ ఆలయానికి జైనూర్‌, ఆసిఫాబా ద్‌, సిర్పూర్‌యూ, లింగాపూర్‌, తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు మూడు రోజుల జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. క్రీడాపోటీలు నిర్వహించడంతో పాటు అన్నదానం చేయనున్నారు.

 

గోదావరి తీరంలో..

దండేపల్లి : మహా శివరాత్రి సందర్భంగా దండేపల్లి మండలంలోని గోదావరి తీరాన ఉన్న ఆలయాలు ముస్తాబయ్యాయి. ద్వారకలో గోదావరి నది ఒడ్డున ఉన్న నందీశ్వరుడు, దత్తాత్రేయ, గంగమ్మ తల్లి, శివాలయం, లక్ష్మీకాంతాపూర్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం, మేదరిపేటలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, పెద్దంపేటలోని పావురాజేశ్వరుడి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. శుక్రవారం పట్నాలు, పూజలు, బోనాలు, అలాగే స్వామి వారికి నైవేద్యం సమర్పించనున్నారు. గూడెం, ద్వారక గోదావరి నది తీరాల వద్ద భక్తులు పవిత్ర స్నానాలకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.


రెండో ఎములాడ.. వేలాల

జైపూర్‌ : జైపూర్‌ మండలం వేలాల గ్రామంలో మూడు రోజుల పాటు జాతరకు ఘనంగా జరగనుంది. శివరాత్రికి ఒకరాత్రి ముందే భక్తులు చేరుకొని దర్శనం కోసం బారులు తీరే అవకాశం ఉండడంతో ఆమేరకు అధికారులు లైటింగ్‌, తాగునీటి, తదితర ఏర్పాట్లుచేసినట్లు ఈఓ రమేశ్‌ తెలిపారు. శివరాత్రి రోజున గట్టు మల్లన్నకు ప్రత్యేక బోనం చెల్లించి రెండవ రోజు గ్రామంలోని మల్లికార్జునస్వామికి బోనాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 21 వరకు సాగే జాతర సా గనుండగా ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబా ద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి సుమారు 2లక్షల వరకు భక్తులు తరలిరానున్నారు. మంచిర్యాల, గోదావరిఖని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు మూడు రోజుల పాటు భక్తులను చే రవేస్తాయి. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో స్నానఘట్టాల వద్ద కంచెలు ఏర్పాటుచేయనున్నారు.


మహిమాన్వితం.. వాంకిడి శివకేశవాలయం

వాంకిడి చిక్లీవాగు తీరంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివకే శవాలయం చరిత్రకు చిహ్నాంగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికగా ఇక్కడ నిర్మిం చాలని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంతో శివకేశవులతో పాటు రేణుకామాత, నవగ్రహా విగ్రహాలు ఉన్నాయి. ఈ శివకేశవాల యం వరంగల్‌లోని వెయ్యిస్తంభాల గుడిని పోలి ఉంది. ఆలయ గోడలపై స్త్రీల నృత్య భంగిమలతో చెక్కిన శిల్పాలు కాకతీయుల శిల్ప కళా నైపుణ్యా నికి అద్దం పడుతున్నాయి. ఈ ఉత్సవాలకు జి ల్లాలోని  అన్ని మండలాల నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తు లు తరలివచ్చి శివకేశవులను దర్శించుకుంటా రు. సాయంత్రం ఐదు గంటల కు ఉత్సవ వి గ్రహాలను ఊరేగింపుగా తీసు కొచ్చి చిక్లీవా గు తీరంలో రథోత్సవం నిర్వహిస్తారు.

-వాంకిడి


logo