శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 19, 2020 , 23:09:41

నిస్వార్థ సేవకుడు.. ఎమ్మెల్యే కోనప్ప

నిస్వార్థ సేవకుడు.. ఎమ్మెల్యే కోనప్ప

కాగజ్‌నగర్‌ రూరల్‌ : నిస్వార్థ సేవకుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అని జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో చేతన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్‌ టీవీల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై కోనప్పతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిర్పూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దాతల సహకారంతో డిజిటల్‌ టీవీలను అందించడంతో మరింత మెరుగైన విద్యాబోధన సాధ్యమవుతుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కోనప్ప మా ట్లాడుతూ గతంలో నియోజకవర్గంలోని పాఠశాలలకు 54 డిజిటల్‌ టీవీలను విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అందించామనీ, దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.  


నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.4 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగులకు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అనంతరం చేతన ఫౌండేషన్‌ అధ్యక్షుడు వెనిగళ్ల రవి మాట్లాడుతూ నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని 50 పాఠశాలల ఉపాధ్యాయులకు డిజిటల్‌ టీవీ, పెన్‌డ్రైవ్‌, స్టెబ్‌లైజర్‌లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌ చైర్మన్‌ గిరీశ్‌ కుమార్‌, డీఈవో పాణిని, కోనేరు ట్రస్ట్‌ చైర్మన్‌ కోనేరు వంశీ, ఎమ్మెల్యే సతీమణి రమాదేవి, ఫౌండేషన్‌ సభ్యులు రంగారావు , బండి నాగేశ్వర్‌రావు, రెబ్బెన జడ్పీటీసీ సంతోష్‌, కోనేరు అనిత, ముత్తినేని సురేశ్‌, ఎంఈవో భిక్షపతి, కోఆప్షన్‌ సిద్దిక్‌, ఎంపీపీ నానయ్య, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. logo