బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 19, 2020 , 23:06:09

భక్తులకు ఇబ్బంది కలుగద్దు

భక్తులకు ఇబ్బంది కలుగద్దు

వాంకిడి :  భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ సుధీంద్ర అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనీ, ఈ నేపథ్యంలో జేబుదొంగలు, చైన్‌స్నాచర్లు ఉంటారనీ, పోలీసులతో పాటు ఐడీ పార్టీ కానిస్టేబుల్స్‌తో బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీకి సూచించారు. ఆలయం చుట్టూ వీధీ దీపాలను ఏర్పాటు చేయించాలని, ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్ల నుంచి వాహనాలు వెళ్లకుండా జడ్పీ పాఠశాల, హెచ్‌పీ గ్యాస్‌ గోదాం, పాత పోలీస్‌స్టేషన్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు ఆలయాన్ని, గర్భగుడిని పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లు, ఉత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్‌ గాదే ప్రవీన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాణాప్రతాప్‌, వాంకిడి సర్పంచ్‌ బండే తుకారాం, తదితరులున్నారు.    


logo