శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 19, 2020 , 23:04:28

భూసార పరీక్షలు చేయించాలి

భూసార పరీక్షలు చేయించాలి

సిర్పూర్‌(టి) : భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలను సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చని జిల్లా డీఏవో భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం పారీగాం, లక్ష్మీపూర్‌లో నిర్వహించిన భూసార పరీక్ష పత్రాల దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసార పరీక్షలతో మట్టిలోని పోషకాలు, లవణాలు, ఇతరత్రా గుణాలను తెలుస్తాయనీ, అంతేగాకుండా ఏ పంట వేస్తే దిగుబడి వస్తుందో తెలుస్తుందన్నారు. 2019-20 సంవత్సరంలో టోంకిని గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద తీసుకొని 205 మంది రైతుల  భూసార పరీక్షలు నిర్వహించి పత్రాలను అందజేశామన్నారు. అదేవిధంగా 2020-21 సంవత్సరంలో పారీగాం గ్రామాన్ని తీసుకున్నామని, త్వరలోనే ఇక్కడి 242 మంది రైతుల భూ సార పరీక్షలు సేకరిస్తామని తెలిపారు. అనంతరం రైతులకు భూసార పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ డుర్కె లక్ష్మి, ఏడీఏ శ్రీనివాస్‌, ఏవో రామకృష్ణ, ఏఈవోలు నేహ తబస్సుమ్‌, శ్రీనివాస్‌  రైతులు పాల్గొన్నారు.


logo