బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 18, 2020 , 23:29:51

అభివృద్ధి పనులు వేగిరం చేయాలి

అభివృద్ధి పనులు   వేగిరం చేయాలి

చదువుతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజయ్య అన్నారు. మంగళవారం కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

  • నాణ్యత లోపించకుండా చూడాలి
  • జడ్పీ సీఈవో వేణు
  • భూసిమెట్ట, జామ్నిలో ఆకస్మిక పర్యటన
  • శ్మశానవాటిక, డంప్‌ యార్డు నిర్మాణాల పరిశీలన

జైనూర్‌ :  అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో వేణు అన్నారు. మంగళవారం ఆ యన మండలంలోని భూసిమెట్ట, జామ్ని గ్రామాలను ఆకస్మికంగా సందర్శించారు. నర్సరీ పనులు, శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డు పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మా ట్లాడు తూ నాణ్యత లోపం లేకుండా పనులు జరిగే లా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని బ్యాంకును సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రుణాలు లబ్ధిదారులకు సకాలంలో అందించాలని సూ చించారు. అనంతరం సర్పంచులతో మాట్లాడు తూ గ్రామపంచాయతీల్లో ట్యాంకర్లు, ట్రాక్టర్లు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో బానవత్‌ దత్తారాం, సర్పంచ్‌ మొతుబాయి మాదవ్‌రావ్‌, ఏపీవో మల్లయ్య న్నారు.logo