బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 17, 2020 , 23:52:13

ఐదున్నర గంటలు 16 అంశాలు..

ఐదున్నర గంటలు 16 అంశాలు..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్స్‌లో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అధ్యతన జిల్లా పరిషత్‌ సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 4.30 గంటల వరకు సాగింది. ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడి.. ఉమ్మడి జిల్లా పరిషత్‌ విభజన తర్వాత జరిగిన మూడో సమావేశం ఐదున్నర గంటల పాటు సాగింది. దాదాపు 16 అంశాలపై సభ్యులు చర్చించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆయా శాఖల అధికారులు వివరించారు.


అటవీశాఖ తీరుపై ఆగ్రహం

అటవీ శాఖ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారుల తీరువల్ల జిల్లా లో చాలా వరకు అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయన్నారు. దిందా- కేతిని గ్రామాల మధ్య రూ. 4 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో నిలిచిపోయాయ నీ, గుడిపేట్‌ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలో నిలిపేశారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సోమిని గ్రామం మధ్యలో అటవీ అధికారులు ట్రెంచ్‌ కొట్టారు. ఇలా అటవీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పశువులను మేపేందుకు అడవుల్లోకి వెళ్లకుండా గిరిజనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారనీ,  ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు పశువులను మేపుకునేందుకు, తమ అవసరాలకు అటవీ సంపదను వినియోగించుకునేందుకు కూ డా చట్టంలో హక్కులున్నాయనీ, కానీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గిరిజనులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించా రు. ఇప్పటికైనా అటవీ అధికారులు తమ తీరుమార్చుకొని అభివృద్ధికి, గిరిజనులకు సహకరించాలన్నారు. 


జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కన క యాదవ్‌రావ్‌ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో కానుకగా ఇచ్చే మంచాలపైనా అటవీ అధికారులు రూ. 70 వేల ఫైన్‌ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల పనులు కూడా జరుగకుండా అడ్డుకుంటున్నారని సభ్యులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో పనిచేస్తున్న భూగర్భ గనుల శాఖ అధికారుల తీరు తో జిల్లా ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోందని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలుతో పాటు సభ్యులు ఆరోపించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌తో పాటు రెబ్బెన మండలం నుంచి పెద్ద మొత్తంలో ఇతర జిల్లాలకు ఇసుక తరలిపోతుందని అధికారులు స్పందించి ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకోవాలనీ, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ, మార్కెటింగ్‌, మిషన్‌ భగీరథ, రహదారులు, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌, జాతీయ రహదారులు, నీటి పారుదల శా ఖ, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌, ఎస్సీ, ఎస్టీ, మహి ళా శిశు సంక్షేమ శాఖలపై సమావేశంలో చర్చించారు. వచ్చే మార్చినాటికి మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సిర్పూర్‌-యులో 108 అంబులెన్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని  జడ్పీటీసీ కోవ అరుణ కోరారు. కాగా 2020-21 సంవత్సరానికి రూ. 129 కోట్లతో ఈజీఎస్‌ ప్రణాళికలకు ఆమోదం తెలిపారు.


logo
>>>>>>